అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం ప్రపంచ సినీ అభిమానులని ఒక ఊపు ఊపేస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సూపర్ హీరోల విన్యాసాలని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫలితంగా అవెంజర్స్ చిత్రం ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు నెలకొల్పింది. సూపర్ హీరోలలో ఐరన్ మాన్ పాత్ర చాలా ప్రత్యేకం. ఎండ్ గేమ్ లో ఐరన్ మాన్ మరణించడం అభిమానులందరినీ ఎమోషన్ కు గురిచేసింది. 

ఐరన్ మాన్ గా రాబర్ట్ డౌనీ జూనియర్ నటించారు. తాజాగా రాబర్ట్ పై మరో హాలీవుడ్ టాప్ హీరో విన్ డీజిల్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ తో విన్ డీజిల్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. రాబర్ట్ చెప్పిన ఓ విషయం తనకు భయాన్ని కలిగిస్తోందని డీజిల్ అంటున్నాడు. తనని కలసిన వారందరిలో రాబర్ట్ స్ఫూర్తిని నింపుతుంటాడు. రాబర్ట్ ఎంపిక చేసుకునే పాత్రలు అద్భుతంగా ఉంటాయి. 

అవెంజర్స్ ఎండ్ గేమ్ రికార్డులు సృష్టిస్తున్నా అతడిలో ఎలాంటి మార్పు లేదు. ఎప్పటిలానే ఉన్నాడు. నేను నటిస్తున్న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9పై రాబర్ట్ నమ్మకం నాకు భయాన్ని కలిగిస్తోంది. నీ తదుపరి చిత్రం ఇలాంటి వసూళ్లే రాబడుతుంది. ఇండస్ట్రీని మరో స్థాయికి చేరుస్తుంది అని రాబర్ట్ తనతో అన్నాడని డీజిల్ తెలిపాడు. తనతో స్నేహం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని కూడా రాబర్ట్ అన్నాడు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది.