హీరో యష్ మరియు కుటుంబం చిన్న భూవివాదంలో చిక్కుకున్నారు. కర్ణాటకలోని హాసన్ జిల్లా తిమ్మాపుర గ్రామంలో యష్ కుటుంబం భూకొనుగోలు గొడవలకు కారణం అయ్యింది. హీరో యశ్ మరియు కుటుంబంపై  రాజ్య రైతు సంఘం కార్యాధ్యక్షుడు అణ్ణాజప్ప, హాసన్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. యశ్‌ కుటుంబం తిమ్మాపుర గ్రామంలో కొనుగోలు చేసిన భూమిలో అక్రమంగా గోడ నిర్మించి రైతులను ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఫిర్యాదులో పొందుపరిచారు. అలాగే కిరాయి మనుషులను తీసుకొచ్చి గ్రామస్తులను యశ్‌ భయపెడుతున్నట్లు ఆరోపించారు. 


ఈ వివాదంలో జోక్యం చేసుకొని పేద రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇటీవల యశ్‌ తల్లికి, గ్రామస్థులకి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. యశ్‌ తల్లి కర్ణాటకలోని హాసన్‌ జిల్లాకు చెందినవారు కాగా అక్కడ ఆమెకు సొంత ఇల్లు ఉంది. హాసన్‌ సమీపంలోని తిమ్మాపుర గ్రామంలో ఇటీవల 80 ఎకరాల భూమిని యశ్‌ కుటుంబం కొనుగోలు చేసింది. తమ పొలాలకు దారిని మూసివేశారని గ్రామస్థులు యశ్‌ తల్లి పుష్పలతతో గొడవ పడ్డారు. వివాదం పెద్దది కావంతో గ్రామస్థులు దుద్ద పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

మరో వైపు కెజిఫ్2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయని సమాచారం. కెజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న కెజిఎఫ్ 2పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. యష్ పుట్టినరోజు కానుకగా విడుదలైన కెజిఎఫ్ 2 టీజర్ భారీ రికార్డ్స్ నమోదు చేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జులై 16న విడుదల కానుంది.