క్రేజీ కాంబినేషన్... బిచ్చగాడు హీరోతో జాతిరత్నాలు హీరోయిన్ రొమాన్స్

టాలీవుడ్ లో మరో  క్రేజీ రేర్ కాంబినేషన్ సెట్ అవ్వబోతోంది. అసలు ఎవరూ ఊహించని విధంగా బిచ్చగాడు హీరోతో.. జాతిరత్నాలు హీరోయిన్ రొమాన్స్ చేయబోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి...? 
 

Faria Abdullah Romance with Bichagadu Hero Vijay Antony

టాలీవుడ్ లో మరో  క్రేజీ రేర్ కాంబినేషన్ సెట్ అవ్వబోతోంది. అసలు ఎవరూ ఊహించని విధంగా బిచ్చగాడు హీరోతో.. జాతిరత్నాలు హీరోయిన్ రొమాన్స్ చేయబోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి...? 

బిచ్చగాడు సినిమాతో తెలుగు, తమిళ ఆడియన్స్ ను అలరించాడు హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ విజ‌య్ ఆంటోనీ.  ఈ మ‌ల్టీ టాలెంటెడ్ యాక్టర్ కన్ను టాలీవుడ్ అప్ కమింగ్ హీరోయిన్ పై పడింది.  విజ‌య్ ఆంటోనీ పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. 

జాతిర‌త్నాలు సినిమాతో ఓవ‌ర్‌నైట్  పాపులారిటీ సంపాధించుకుంది హైద‌రాబాదీ ముద్దుగుమ్మ ఫ‌రియా అబ్దుల్లా కాని  ఆ త‌ర్వాత ఆమెకు మళ్ళీ కలిసి రాలేదు.  మ‌ళ్లీ ఆ స్థాయి హిట్టు అందుకోలేదు. ప్ర‌స్తుతం సుధీర్ వర్మ  డైరెక్ష‌న్‌ లో ర‌వితేజ హీరోగా రూపొందుతున్న రావ‌ణాసుర లో హీరోయిన్ గా న‌టిస్తోంది ఫరియా. 

ఇక ఈ  బ్యూటీ విజ‌య్ ఆంటోనీతో జతకట్టబోతోన్నట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్  ఫరియా కొట్టేసిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 80ల‌లో పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమా ఐదు భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది. 

ఇక ఈ ప్రాజెక్టు షూటింగ్ మే లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. విజ‌య్ ఆంటోనీ సినిమాలంటే బాక్సాపీస్ దగ్గర మంచి క్రేజ్ ఉంటుంది. మ‌రి ఈ సారి పీరియాడిక్  డ్రామా స్టోరీని ఏ విధంగా డ్రైవ్ చేస్తాడా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios