మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంపై క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే విడుదల చేసిన మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలని రెట్టింపు చేసింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన లొకేషన్స్, విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. ఇక స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో బ్రిటిష్ సైన్యంతో జరిగే యాక్షన్ సన్నివేశాలు అబ్బురపరచబోతున్నట్లు తెలుస్తోంది. 

దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో పాటు హిందీ, తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. అందువల్లనే అన్ని భాషలకు చేసిన క్రేజీ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ట్రిక్ వర్కౌట్ అయ్యేలా ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఈ చిత్రంలో నటిస్తునడంతో హిందీలో కూడా సైరాకు క్రేజ్ వచ్చింది. 

హిందీలో సైరా చిత్రాన్ని భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు. మల్టి టాలెంటెడ్ బాలీవుడ్ హీరో ఫరాన్ అక్తర్ సైరా చిత్ర హిందీ హక్కులని సొంతం చేసుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, ఫరాన్ అక్తర్ కు చెందిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ కలసి ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్నాయి. 

ఫరాన్ అక్తర్ ఇది వరకే కన్నడ సూపర్ హిట్ చిత్రం కెజిఎఫ్ ని ఫరాన్ హిందీలో రిలీజ్ చేశారు. ఆ చిత్రం భారీ స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టడంతో ఫరాన్ మరో సౌత్ ఇండియన్ మూవీ సైరాని రిలీజ్ చేస్తున్నారు.