తొలిరోజు వసూళ్లు అదరగొట్టిన కళ్యాణ్ రామ్

తొలిరోజు వసూళ్లు అదరగొట్టిన కళ్యాణ్ రామ్

ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ .. కాజల్ జంటగా నటించిన 'ఎమ్మెల్యే' చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలిరోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5.20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. తొలిరోజునే నైజామ్ లో 86 లక్షలకి పైగా .. సీడెడ్ లో 51 లక్షలకి పైగా సాధించడం విశేషం. కల్యాణ్ రామ్ కెరియర్లోనే ఇవి అత్యధిక వసూళ్లని అంటున్నారు.

ఇలా తెలుగు రాష్ట్రాల్లోను .. ఇతర ప్రాంతాల్లోను కలుపుకుని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 5.20 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. కల్యాణ్ రామ్ న్యూ లుక్ తో హ్యాండ్సమ్ గా కనిపించడం .. కాజల్ గ్లామర్ మంత్రం ఎక్కువగా పనిచేయడం .. ఆసక్తికరమైన మలుపులతో కూడిన కథాకథనాలు ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు తెచ్చిపెట్టాయని అంటున్నారు. ఈ వీకెండ్ లో వసూళ్లు మరింతగా పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos