మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి  తక్కువ సమయంలో డైహార్డ్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. చరణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులు భారీ వేడుకలకు సిద్ధమవుతున్నారు.

క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు డైహార్ట్ ఫ్యాన్స్ వేలల్లోనే ఉన్నారు. ఆయన సినిమాల పట్ల, స్పెషల్ అకేషన్స్ ను సెలబ్రేట్ చేయడంలో అభిమానులు ఎంతో శ్రద్ధ చూపిస్తుంటారు. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) తెరకెక్కించిన ‘చిరుత’ మూవీతో మెగా ఫ్యామిలీ నుంచి యంగ్ హీరోగా తెలుగు ఆడియెన్స్ కు పరిచయడం అయ్యాడు. ఈ సినిమాతో ప్రేక్షకుల అటెన్షన్ ను డ్రా చేసిన చెర్రీ.. మగధీర మూవీ భారీ సక్సెస్ తో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ తన పాపులారిటినీ పెంచుకుంటూనే వస్తున్నాడు. 

అయితే ఆయన చిత్రాల కథల ఎంపికలో కొంత ఫ్యాన్స్ అసంత్రుప్తిని వ్యక్తం చేస్తున్నట్టు తెలుసుకున్న రామ్ చరణ్.. ధ్రువ, రంగస్థలం నుంచి రూట్ మార్చాడు. ఫ్యాన్స్ లో గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం జక్కన్న దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’RRR మూవీలో ఉద్యమ వీరుడు సీతారామరాజు పాత్రలో నటించాడు రామ్ చరణ్. ఈ చిత్రంలో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. 

Scroll to load tweet…

మార్చి 25న ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అవుతుండగా థియేటర్ల వద్ధ సందడి నెలకొంది. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ భారీ కటౌట్లతో తన తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే, మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే. ఇందుకు గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసేందుకు చెర్రీ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 4:32 నిమిషాలకు శిల్పాకళావేదికలో రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఆర్సీ యువ శక్తి (RC Yuva Shakthi) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. 

Scroll to load tweet…

మరోవైపు ఆర్సీ యువ శక్తి తరుఫున ఓ విజువల్ ట్రీట్ కూడా అందనుంది. ఈ సందర్భంగా మార్చి 26న సాయంత్రం 6:03 నిమిషాలకు చెర్రీ బర్త్ డే సందర్భంగా మెగా పవర్ స్టార్ బర్త్ డే మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆర్సీ యువశక్తి ఓ పోస్టర్ ను షేర్ చేస్తూ భారీ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఓవైపు ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్స్, మరోవైపు చెర్రీ పుట్టిన రోజు వేడుకలతో తెలుగు రాష్ట్రాల్లో ఆ రెండు రోజులు సందడి నెలకొననుంది.