సినీ పరిశ్రమలో పలువురు బాక్సాఫీస్ షేర్ ల మధ్య ఫ్రెండ్ షిప్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ఫైట్ ఉన్నా బయట మంచి స్నేహం హీరోల మధ్య స్నేహం ఉన్నా.. వాళ్ల అభిమానుల మధ్య వైరం
మన హీరోల్లో చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. అందులో స్టార్ స్టేటస్ ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. అలా ఫ్రెండ్ షిప్ ఉన్న వాళ్లలో రామ్ చరణ ్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. అయితే ఈ ఫ్రెండ్ షిప్ ఎందుకోగానీ... ఇటు మెగా అభిమానులకు, అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు అస్సలు నచ్చదు. బాక్సాఫీస్ వద్దా నువ్వా నేనా అనే రేంజ్ లో ఫైట్ ఉంటుందో ఉండదో గానీ, అభిమానుల మధ్య మాత్రం ప్రాణాలు తీసుకునే దాకా అభిమానం ఉంటోంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో మహేష్ బాబు కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. మెగా స్టార్ అంటే ఎంతో ఇష్టపడే మహేష్ బాబుకు చరణ్ మంచి స్నేహితుడు. అయితే ఫ్యాన్ వార్ మాత్రం ఆగదు.
ఇదే విషయంపై మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ... తమిళనాడులో కంటే తెలుగునాట ఫాన్ వార్స్ చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పాడు. ''నేను చిరంజీవి సర్‌కి, చరణ్‌కి చాలా క్లోజ్. అయినప్పటికీ ఫాన్స్ మాత్రం బాక్సాఫీస్ రికార్డ్స్ కోసం కొట్టుకుంటారు'' అని మహేష్ వ్యాఖ్యానించాడు.
ఓ పక్క మహేష్, చరణ్ ఫ్యామిలీస్‌తో కలిసి సరదాగా విదేశాలకి టూర్లకి వెళ్లి ఎంజాయ్ చేసి వస్తోంటే, ఇక్కడేమో వారి అభిమానులు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ కాలం వెల్లదీసే పరిస్థితులున్నాయి. చరణ్ సినిమా వస్తే మహేష్ ఫాన్స్ పనిగట్టుకుని మరీ ఫ్లాప్ ఫ్లాప్ అంటూ మౌత్ టాక్ స్ప్రెడ్ చేయడం, మహేష్ సినిమా ఫ్లాప్ అయిందంటే చరణ్ ఫాన్స్ సంబరాలు చేసుకోవడం అనాదిగా జరుగుతూనే వుంది. 'అరె మన హీరో స్నేహితుడి సినిమానే కదా' అనేది అభిమానుల విషయంలో అస్సలు వుండదు.
హీరోల మధ్య సఖ్యత అనేది ఎప్పుడూ వున్నా ఫాన్స్‌కి మాత్రం అవతలి హీరో, అతని అభిమాని ఎప్పుడూ శత్రువులే. అయితే ఈ విపరీత ధోరణి రాను రాను తగ్గాల్సింది పోయి ఇంకా ఇంకా పెరిగి పోవడం విచారకరం. ఫ్యాన్ వార్స్ గతంలోకంటే ఎక్కువగా ఇప్పుడే జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా వేదికగా పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడం, సవాళ్లు, ఫైట్లు ఇలా ఫ్యాన్ వార్స్ ఇప్పుడు తారాస్థాయిలో జరుగుతున్నాయి. వీటికి అంతం ఎప్పుడో,
