క్రికెట్ విషయంలో అభిమానుల్లో చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ కొన్ని ఫన్నీగా కూడా ఉంటాయి.
వరల్డ్ కప్ టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా రాణించిన టీమిండియాకి అసలు సిసలైన ఫైనల్ లో పరాభవం తప్పలేదు. టోర్నీ మొత్తం తిరుగులేదు అన్నట్లుగా ప్రత్యర్థుల్ని మట్టికరిపించిన రోహిత్ సేన ఫైనల్ ఒక్క అడుగులో తడబడ్డారు. ఫలితంగా ఆస్ట్రేలియాకి కప్ సమర్పించుకున్నారు.
అయితే చాలా మంది ఫ్యాన్స్, సెలెబ్రిటీలు టీమిండియాకి మద్దతు తెలుపుతూ పోస్ట్ లు చేస్తున్నారు. నవంబర్ 19న టీమిండియాకి ఏది కలిసిరాలేదు అంతే కానీ టీం లో టాలెంట్ తక్కువ లేదు అని అంటున్నారు. కానీ ఫైనల్ ఓటమి మాత్రం ప్రతి ఒక్కరికి గుండె కోత లాంటిదే. లీగ్ దశలో కూడా ఇండియా.. ఆస్ట్రేలియాపై అద్భుతంగా విజయం సాధించింది. ఏ రకంగా చూసినా మన జట్టు ఆస్ట్రేలియా కంటే బలంగా కనిపించింది.
కానీ ఆదివారం టీమిండియా కి బ్యాడ్ డే అని అంటున్నారు. అయితే క్రికెట్ విషయంలో అభిమానుల్లో చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ కొన్ని ఫన్నీగా కూడా ఉంటాయి. 2015 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగింది అప్పుడు ఆ జట్టు విజయం సాధించింది. 2019లో కూడా ఆతిథ్య ఇంగ్లాడ్ జట్టే కప్ గెలిచింది. ఇప్పుడు ఇండియాలో జరుగుతోంది కాబట్టి కప్ మనదే అని అంతా భావించారు.
కొందరు ఫ్యాన్స్ అయితే టీమిండియా విజయాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ తో ముడిపెడుతూ ఫన్నీగా మీమ్స్ చేశారు. అనవసరంగా మెహర్ రమేష్ ని ట్రోల్ చేశారు. మెహర్ రమేష్ ఫ్లాప్ మూవీ తీసినప్పుడల్లా ఇండియా కప్ గెలుస్తుంది అంటూ ట్రోల్ చేశారు. కానీ ఆ సెంటిమెంట్ ఏ మాత్రం వర్క్ కాలేదు. అదేంటంటే.. మెహర్ రమేష్ 2011లో శక్తి చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పడూ ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. 2013లో షాడో తీశారు. అప్పుడు ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఈ ఏడాది మెహర్ రమేష్ నుంచి భోళా శంకర్ చిత్రం వచ్చింది. దీనితో వరల్డ్ కప్ గ్యారెంటీగా టీమిండియాదే అంటూ మీమ్స్ పెట్టారు. కానీ ఫలితం ఇండియాకి అనుకూలంగా రాలేదు. ఇలాంటి మీమ్స్, సెంటిమెంట్స్ వర్కౌట్ కావని తేలిపోయింది. అనవసరంగా మెహర్ రమేష్ ని ట్రోల్ చేసారు కదా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
