అల్లు అర్జున్‌కి ఉన్న ఫాలోయింగ్‌, క్రేజ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన తెలుగు రాష్ట్రాల్లోనేకాదు, ఇతర స్టేట్స్ లోనూ ఆయనకు భారీ ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా బన్నీకి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏంటో మరోసారి నిరూపితమైంది. రాత్రి సమయంలో కూడా బన్నీ కోసం ఫ్యాన్స్ ఎగబడటం విశేషం. రంపచోడవరంలో బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ వేలాదిగా తరలి వచ్చారు. దీంతో రంపచోడవరం జంక్షన్‌ కిక్కిరిసిపోయింది. 

బన్నీ ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. చాలా రోజులుగా ఈ చిత్ర షూటింగ్‌ తూర్ప గోదావరి జిల్లాలోని రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి ఫారెస్ట్ లో జరుగుతుంది. అయితే మంగళవారంతో ఈ సినిమా షూటింగ్‌ రంపచోడవరంలో పూర్తయినట్టు తెలుస్తుంది. దీంతో అల్లు అర్జున్‌ వెళ్లిపోతున్నారనే వార్త తెలిసి భారీగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. రంపచోడవరం జంక్షన్‌ వద్ద చుట్టు ముట్టారు. ఊహించని విధంగా అభిమానులు తరలిరావడంతో బన్నీ సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. 

సెల్‌ ఫోన్‌ ఫ్లాష్‌ లైట్లలో ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో బన్నీ తన కారులోని రూఫ్‌ టాప్‌లో నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోని తాజాగా ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేశారు బన్నీ. `థ్యాంకూ రంపచోడవరం` అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం బన్నీ హైదరాబాద్‌ చేరుకున్నారు. కానీ బన్నీ పంచుకున్న ఫోటో, పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.