Asianet News TeluguAsianet News Telugu

‘పుష్ప’: కేరళ లో ఫ్యాన్ షోస్ రచ్చ,అక్కడేం జరుగుతోందో తెలిస్తే షాకే


అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో ఇప్పటివరకూ రెండు సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్న మూడో సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. 

Fans Shows Craze In Kerala For Pushpa
Author
Kochi, First Published Nov 19, 2021, 6:13 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun)కు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు కేరళలో కూడా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆయన సినిమాలు తెలుగుతోపాటు మలయాళంలో కూడా విడుదలవుతుంటాయి. అక్కడి అభిమానులు బన్నీని ప్రేమగా మల్లు అర్జున్‌ అని పిలుస్తుంటారు. అంతెందుకు ఆ మధ్యన కేరళ పోలీసులు పోల్‌ యాప్‌ పేరుతో ఓ మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేశారు. ఈ యాప్‌ ప్రమోషన్‌ కోసం ‘రేసుగుర్రం’లో Allu Arjun పోలీస్‌ గెటప్‌లో ఎంట్రీ ఇచ్చిన సీన్‌ను ఉపయోగించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోని కేరళ పోలీస్‌ విభాగం ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. మలయాళంలో ఎంతోమంది సూపర్‌స్టార్స్‌ ఉండగా.. అల్లు అర్జున్‌ సినిమా వీడియోనే వాడడం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఇవన్ని గుర్తు చేసుకోవటం ఎందుకంటే ..పుష్ప సినిమా కేరళ రిలీజ్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి..

మలయాళం ఇండస్ట్రీలో అయితే బన్నీ కి ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. అక్కడ మల్లు స్టార్ అనే క్రేజ్ కూడా ఉందని అందరికీ తెలిసిందే. ఇక `పుష్ప`(Pushpa) సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మలయాళంలో హైలెట్ అవుతోంది. ఇక కేరళలో 200+ స్క్రీన్ లలో సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే 40+ స్క్రీన్స్ లలో ఫ్యాన్స్ టికెట్స్ భారీగా అమ్ముడైనట్లు సమాచారం. ఈ షోని ప్రత్యేకంగా అల్లు అరవింద్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఆయన ఎప్పటికప్పుడు ఆప్డేట్స్ తీసుకుంటన్నారు. కేరళలో తెలుగుతో సమానంగా మార్కెట్ ని విస్తరించాలనే పట్టుదలతో ఈ సారి టీమ్ మొత్తం కృషి చేస్తోందిట. అల్లు అర్జున్ పర్శనల్ టీమ్ సైతం కొద్ది రోజులు కేరళలో ఉండి అక్కడ రిలీజ్ ఏర్పాట్లు చూడబోతోందిట. 

ఇక బన్నీ తో పాటు ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ యాక్టర్ కూడా తోడవడంతో కేరళలో సినిమా  విడుదలకి నెల రోజుల ముందే సందడి మొదలైంది. ఈనేపథ్యంలోనే ఈసినిమాను కేరళలో కూడా అదే రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మరి తమ అభిమాన హీరో సినిమా వస్తుందంటే  ఫ్యాన్స్ మాత్రం ఊరుకుంటారా.. అందుకే ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా షోస్ వేయనున్నారట. 
 
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో ఇప్పటివరకూ రెండు సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్న మూడో సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుండగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్, సింగిల్స్, పోస్టర్స్, గెటప్స్ ఇలా ఒక్కటి అని కాకుండా ప్రతిదీ ప్రేక్షకులను, అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.
 
 మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా…ఇక ఈసినిమాలో ఫహాద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ గా, రష్మిక శ్రీ వల్లి గా, సునీల్ మంగళం శ్రీనుగా అనసూయ దాక్షాయణి గా కనిపించనున్నారు.

also read: Pushpa: 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' సాంగ్ వచ్చేసింది.. తన సైన్యంతో అల్లు అర్జున్ చిందులు

Follow Us:
Download App:
  • android
  • ios