అక్కినేని సమంత తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఇప్పటివరకు సమంత అన్ని సినిమాలకు సింగర్ చిన్మయి డబ్బింగ్ చెబుతూ వస్తోంది. అయితే 'మహానటి' సినిమాలో తొలిసారి సమంత తన పాత్రకు డబ్బింగ్ చెప్పింది.

అందులో ఆమెకి ఎక్కువ డైలాగులు లేకపోవడం పైగా నత్తి పాత్ర కావడంతో ఆమె డబ్బింగ్ కి సంబంధించి ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. తాజాగా ఆమె 'యూటర్న్' సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం సమంత డబ్బింగ్ మానుకో అంటూ ఆమెకు సూచిస్తున్నారు. ఈ సినిమాలో సమంత చుట్టూ తిరుగుతుంది. కథను మొత్తం తానే నడిపించాలి.

ఇదంతా తెలిసి కూడా సమంత తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడే ఆమె తెలుగు డబ్బింగ్ బాగాలేదనే విమర్శలు ఎదురయ్యాయి. వీటికి స్పందిస్తూ మరింత మెరుగ్గా చేసే ప్రయత్నం చేస్తున్నామంటూ వెల్లడించింది సమంత. అయితే సినిమాలో ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె డైలాగ్స్ అర్ధం కాలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఏడుస్తున్నప్పుడు సమంత ఏం చెప్పిందో అర్ధం కాక ఇబ్బంది పడ్డామని నెటిజన్లు అంటున్నారు. చిన్మయి గొంతు అంత బాగా సెట్ అయినప్పుడు ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు అవసరమా సామ్..? అంటూ మరికొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి!