రజిని రాజకీయ అరంగేట్రం అనేది దానిపై సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ఎప్పటి నుండో ఆయన రజిని అభిమానులు ఆయన పాలిటిక్స్ లో ఎంటర్ కావాలని కోరుకుంటున్నారు. జయలలిత మరణం తరువాత తమిళనాడులో రాజకీయ అనిశ్చితి చోటు చేసుకుంది. కుర్చీల కుమ్ములాట జరిగింది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుండో స్తబ్దుగా ఉన్న రజినీ తన పొలిటికల్ ఎంట్రీని ధృవీకరించారు. 2017 డిసెంబర్ లో రజిని పొలిటికల్ పార్టీ స్థాపించడంతో పాటు 2021 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 

ఈ వార్త రజినీ అభిమానులను ఎంతగానో సంతోష పరిచింది. రజిని ప్రకటన చేసి దాదాపు మూడేళ్లు అవుతున్నా ఆయన అధికారికంగా పార్టీని స్థాపించడం కానీ,  బలోపేతం చేయడం కానీ చేయలేదు. ఎన్నికలకు నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ నుండి ఒత్తిడి ఎక్కువైంది. వరుస సినిమాలు ప్రకటిస్తున్న రజినీ రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తున్నారన్న మాట కూడా వినిపిస్తుంది. 

దీనితో రజిని ఇంటి ముందు ఆయన అభిమానులు బైఠాయించారు. పొలిటికల్ ఎంట్రీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయడంపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఫ్యాన్స్ లోనే కొందరు మీ ఆరోగ్యం, క్షేమం ముఖ్యం మీ నిర్ణయం ఏదైనా స్వాగతిస్తాం అని అంటున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ, రాజకీయాలు తనకు సేఫ్ కాదని రజిని భావిస్తున్నట్లు సమాచారం . అందుకే రజినీ పాలిటిక్స్ కి పూర్తిగా చరమ గీతం పాడాలని అనుకుంటున్నారట.  మరో వైపు కమల్ హాసన్ పార్టీ స్థాపించడంతో పాటు క్రియా శీలక రాజకీయాలు చేస్తున్నారు.