వ్రతం చెడినా.. ఫలితం దక్కినట్టు. సినిమాపై యావరేజ్ టాక్ వచ్చినా.. మన హీరోకి మాత్రం మంచి పేరు వచ్చింది బాలీవుడ్ లో. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చడ్డాలో  నాగచైతన్య పెర్ఫామెన్స్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. 

అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది. ఎన్నో వివాదాల నడుమ, భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈసినిమాపై ఆడియన్స్ తమ ఆదరణ చూపించారు. సినిమా ఎలా ఉంటుందా అని ఆత్రుతతో వెళ్ళి మరీ చూశారు. లాల్ సింగ్ చడ్డాకు మద్దతుగా నిలిచారు ఆడియన్స్. ఇక ముఖ్యంగా ఈసినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య పై అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ లోను ప్రశంసల జల్లు కురుస్తోంది. 

లాల్ సింగ్ చడ్డా సినిమాలో అమీర్ ఖాన్ లాల్ పాత్రకు ఉన్న స్నేహితుడు బాలా పాత్రలో నాగచైతన్య నటించి మెప్పించాడు. నాగచైతన్య పాత్రపై ట్విట్టర్ ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఆడియన్స్. ముఖ్యంగా ఫ్యాన్స్ చైతూపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అటుబాలీవుడ్ స్టార్స్ తో పాటు సౌత్ స్టార్స్ కూడా చైతూ నటనకు అభినందనలు తెలిపారు మా నాగచైతన్య ఒక అద్భుతం, ఆయన అద్భుతంగా నటించాడు కీలకమైన సన్నీవేశాలను అలవోకగా పండించాడు అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు. ఎమోజీకి హ్యాట్సాఫ్ ఇచ్చాడు.

ఒక అభిమాని చైతూని లాల్ సింగ్ చడ్డా సినిమాలో ఒక సర్ప్రైజ్ ప్యాకేజీ గా అభివర్ణించాడు. అంతూ కాదు చైతూను అతని తండ్రి నాగార్జునతో పోల్చుతున్నారు ఫ్యాన్స్. తండ్రి చైతన్య అక్కినేనితో పోల్చాడు. ఇక లాల్‌సింగ్‌ చడ్డా అనే హ్యాష్‌ట్యాగ్‌ తో పాటు నాగచైతన్య హ్యాష్ ట్యాగ్ ను చూడటం ఆనందంగా ఉంది అన్నారు. అంతే కాదు నాగార్జున చెప్పినట్టు నాగచైతన్య నడుడిగా ఎదుగుతుండటం తమకు ఎంతో ఆనందాన్నిచిందంటూ.. సోషల్ మీడియా వేధికగా వెల్లడిస్తున్నారు ఫ్యాన్స్. 

లాల్ సింగ్ చద్దా నాగ చైతన్య ఫస్ట్ బాలీవుడ్ మూవీ. ఈ సినిమాలో చైతూ చేసింది సపోర్టింగ్ రోల్‌ అయినా.. ఆయన హీరోకు తక్కువ కాని ఇహేజ్ తో ఉంటుంది ఆపాత్రం. ఇక అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్ట్ 11న విడుదలైంది. ఈ సినిమా టామ్ హాంక్స్ ప్రధాన పాత్రలో నటించిన 1994 అమెరికన్ చిత్రం ఫారెస్ట్ గంప్ కి రీమేక్ గా తెరకెక్కింది.