Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్‌ కోసం ఫ్యాన్స్ ఎనిమిది రోజుల ప్లాన్‌!

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజుని పురస్కరించుకుని ఖిల భారత చిరంజీవి యువత ఓ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. వివిధ రకాల సేవా కార్యక్రమాలతో ముందుకు సాగబోతున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ని ఆదివారం ప్రకటించారు. 

fans eight days plan for megastar chiranjeevi birthday
Author
Hyderabad, First Published Aug 2, 2020, 8:44 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి కోసం ఫ్యాన్స్ భారీ ప్లాన్‌ చేస్తున్నారు. వైరస్ వల్ల డైరెక్ట్గ్‌ గా అభిమాన హీరోని కలవలేని పరిస్థితి నెలకొంది. దీని వల్ల తామున్న ప్రాంతంలోనే పలు సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అఖిల భారత చిరంజీవి యువత ఓ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. వివిధ రకాల సేవా కార్యక్రమాలతో ముందుకు సాగబోతున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ని ఆదివారం ప్రకటించారు. 

ఇందులో ఈ నెల 15 నుంచి 22 వరకు ఎనిమిది రోజుల పాటు చిరంజీవి జన్మదిన వారోత్సవాలు పేరుతో తాము చేపడుతున్న కార్యక్రమాలను ప్రకటించారు. మొదటి రోజు (15-8-2020) మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టబోతున్నారు. రెండో రోజు(16-8-20) మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించబోతున్నారు. మూడో రోజు (17-8-20) ప్రతీసెంటర్‌లో ఉన్న థియేటర్స్ స్టాఫ్‌కి అన్ని విధాల సహాయ సహకారాలు అందించనున్నారు. ఇందులో భాగంగా బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, శానిటైజర్స్, మాస్కులు అందించనున్నారు. 

నాలుగో రోజు(18-8-20) రెండు కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో  ఫస్ట్ ది చిరంజీవి జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ, సెకండ్‌ది చిరంజీవి పేరు మీద శ్రీఅంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించబోతున్నారు.  ఐదో రోజు(19-8-2020) కంటివైద్య పరీక్షల శిబిరాలు, కాన్సర్‌ పరీక్షల శిబిరాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆరో రోజు(20-8-2020) అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. 

ఇక ఏడో రోజు(21-8-2020) చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు, కరోనా సమయంలో ప్రజలకు అత్యున్నత సేవలు అందించిన పోలీసులకు, వైద్యబృందానికి, పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానం, మెగా అవార్డ్స్ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఇక చిరంజీవి బర్త్ డే రోజైన 22-8-2020న వినాయక చవితి పూజలు ఘనంగా నిర్వహించి చిరంజీవి `జనకుల` గోత్ర నామాలతో పూజలు చేయించాలని నిర్ణయించారు.

ఇంతటి భారీ ప్రణాళికతో అఖిల భారత చిరంజీవి యువత ముందుకు సాగుతుంది. మరోవైపు  రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. `మెగాస్టార్ మెగా ర్యాప్` పేరుతో ఓ సాంగ్‌ని విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఆయనకు బర్త్‌ డే ట్రీట్‌ ఇవ్వాలనుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios