Asianet News TeluguAsianet News Telugu

అందుకే బాలయ్య వాయిస్ అలా ఉందట..

  • బాలయ్య అభిమానులను కలవర పెడుతున్న ఓ ప్నశ్న
  • బాలయ్య గొంతు  అలా ఎందుకు అయ్యిందంటూ చర్చలు
  • సమాధానం ఇచ్చిన బాలకృష్ణ
Fans Concerned About Balayya Voice

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన పైసా వసూల్ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా బాగుంది అనే టాక్ రావడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే.. ఆయన   అభిమానులను గత కొంతకాలంగా కలవర పెడుతున్న ఓ ప్రశ్నకు బాలయ్య ఇచ్చిన సమాధానంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

అసలు విషయానికి వస్తే.. పైసా వసూల్ సినిమాలో బాలయ్య గొంతు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. దీంతో ఆయన గొంతుకు  ఏమైందా అని  చాలా మంది కంగారుపడ్డారు.ఫేస్ బుక్ లైవ్ లోకూడా ఆయన గొంతు అలాగే వినిపించటం తో బాలయ్య గొంతుకి ఏమైంది? అని ఓ అభిమాని అడిగాడు. దానికి పూరీ జ‌గ‌న్నాథ్ స‌మాధానం చెబుతూ.. నిన్న తీసిన వ‌ర్షం సాంగులో బాల‌య్య బాబు తడిచారని, దీంతో ఆయ‌న గొంతు అలా మారిపోయింద‌ని కారణం చెప్పారు.

 

కానీ పైసా వసూల్ స్టంపర్ మేకింగ్ కు, అడియో సక్సెస్ మీట్ కు మధ్య కాస్త ఎక్కువ గ్యాప్ నే వుంది. మరి ఇన్ని రోజులైన బాలయ్య గొంతు సరికాకపోవడం ఏమిటి? పైగా మంచి మంచి డాక్టర్లు అందుబాటులో వుంటారు కదా? అంటే ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు అని కొన్ని సమాధానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఒకవేళ వాటర్ ఛేంజ్ వల్ల అలా అయ్యిందా లేక.. డబ్బింగ్ ఒకేసారి చెప్పి అలా అయ్యిందా అని ఎవరికి తోచినట్లు వారు అనుకోవడం ప్రారంభించారు.

 

కాగా.. దీనిపై బాలయ్య తాజాగా క్లారిటీ ఇచ్చారు. తకకు తన తండ్రి ఆల్ టైం క్లాసిక్ 'శివశంకరి శివానంద లహరి'.. అనే పాట అంటే చాలా చాలా ఇష్టమని.. ఆ పాటను తరచుగా వింటుంటానని.. ఆ పాటను ఎప్పటికైనా లైవ్‌లో పాడాలన్నది తన కోరిక అని.. అందుకోసం చాలా కాలంగా సాధన చేస్తున్నానని.. మరీ అతిగా ప్రాక్టీస్ చేసి గొంతు మీద ఒత్తిడి తేవడంతో బొంగురు పోయిందని వెల్లడించాడు బాలయ్య
 

Follow Us:
Download App:
  • android
  • ios