Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్-బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్!

ఫ్యాన్ వార్స్ ఈ మధ్య టాలీవుడ్ లో ఎక్కువైపోయాయి. ఆ మధ్య మహేష్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఇలాగే వార్ నడిచింది. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో యుద్ధానికి దిగారు బన్నీ ఫ్యాన్స్.

fan war between allu arjun and ntr fans trending nasty hash tags ksr
Author
Hyderabad, First Published Jun 20, 2021, 3:01 PM IST

వేళాపాళా లేకుండా సోషల్ మీడియా వార్ కి దిగారు ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎన్టీఆర్ పై బన్నీ ఫ్యాన్స్, బన్నీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాస్టీ హ్యాష్ ట్యాగ్స్ తో సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతున్నారు. ఈ సోషల్ మీడియా ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. 


ఫ్యాన్ వార్స్ ఈ మధ్య టాలీవుడ్ లో ఎక్కువైపోయాయి. ఆ మధ్య మహేష్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఇలాగే వార్ నడిచింది. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో యుద్ధానికి దిగారు బన్నీ ఫ్యాన్స్. ఒకప్పుడు ప్రత్యక్షంగా కొట్టుకునే అభిమానులు సోషల్ మీడియా విప్లవం తరువాత ఈ విధంగా ఒకరిని మరొకరు విమర్శించుకుంటున్నారు. 


టాలీవుడ్ హీరోల మధ్య చెప్పుకోవడానికి పెద్ద గొడవలు ఏమీ లేవు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురంలో చిత్రాలు సంక్రాంతికి పోటీపడ్డాయి. అయితే థియేటర్స్ సర్దుబాటు విషయంలో మహేష్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు తలెత్తాయి. అవి తరువాత సమసిపోయాయి. ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఇలా కొట్టుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios