ఒక్కోసారి అభిమానుల చర్యలు హీరోలకు చికాకు తెప్పిస్తూ ఉంటాయి. సమయం సందర్భం లేకుండా ఫోటోలకు ఎగబడి వాళ్ల ఆగ్రహానికి కారణం అవుతూ ఉంటారు. విషాదంలో ఉన్న బాలయ్యతో సెల్ఫీకి ట్రై చేసిన ఓ అభిమాని కోపం తెప్పించాడు.  

నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి ఆగస్టు 1వ తేదీ సోమవారం ఆత్మహ్యత్య చేసుకున్నారు.మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంగా ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఉమా మహేశ్వరి అంత్యక్రియలు బుధవారం మహాప్రస్థానంలో పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమా మహేశ్వరి అన్నయ్య బాలకృష్ణ పాల్గొన్నారు. ఆయన సోదరి పాడె మోశారు. ఇదిలా ఉండగా ఉమా మహేశ్వరి అంత్యక్రియలు జరుగుతుండగా ఓ అభిమాని బాలయ్యతో సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. 

సోదరి మరణంతో అత్యంత వేదనతో ఉన్న బాలయ్యతో(Balakrishna) ఫోటో దిగడానికి ప్రయత్నించిన అభిమాని చర్య ఆయనకు కోపం తెప్పించింది. కళ్ళ పెద్దవి చేసి ఆ అభిమాని వైపు చూడగానే మనోడికి విషయం అర్థమైంది. దానితో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లేకుండా బాలయ్య ఉగ్రరూపం ఆ అభిమాని చూడాల్సి వచ్చేది. ఇక గతంలో బాలయ్య అభిమానుల పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. పలు సందర్భాల్లో ఆయన అభిమానులపై చేయి చేసుకున్నారు. అయితే అభిమానులు మాత్రం ఆయన చేతిలో దెబ్బలు తినడం కూడా అదృష్టమే అంటారు. 

ఇక అఖండ మూవీతో భారీ హిట్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం క్రాక్ ఫేమ్ గోపీ చంద్ మలినేని తో మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. అనంతరం బాలయ్య దర్శకుడు అనిల్ రావిపూడితో మూవీ చేయనున్నారు. ఈ రెండు చిత్రాలపై పరిశ్రమలో భారీ హైప్ నెలకొని ఉంది. బాలయ్య 107వ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.