సింగర్ చిన్మయి ఆలపించిన ఓ గీతానికి ఆమెకి క్రెడిట్ ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమిళ నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ హీరోగా 'సర్వం తాళమాయం' అనే సినిమా రూపొందుతోంది. రాజీవ్ మీనన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.

డిసంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా సినిమాలో 'మాయ మాయ' అనే పాటను విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ని పాషా త్రిపాఠి ఆలపించగా, తమిళ వెర్షన్ ని చిన్మయి పాడారు.

నిన్న విడుదలైన తెలుగు లిరికల్ పాటలో పాషా త్రిపాఠికి క్రెడిట్ ఇచ్చిన చిత్రబృందం, తమిళ పాటలో మాత్రం చిన్మయి పేరు యాడ్ చేయలేదు. ఇది గమనించిన ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా.. లిరికల్ వీడియో నుండి చిన్మయి పేరు తొలగించారు. ఏంటిది..? ఇది కరెక్ట్ కాదు. ఇలా చేయమని జియో స్టూడియోను ఒత్తిడి చేసారా..? అంటూ ప్రశ్నించారు.

ఇది చూసిన చిన్మయి.. 'మీ ట్వీట్ చూసే వరకు నేను ఈ విషయం గమనించలేదు. థాంక్స్.. బాగా చేశారు జియో స్టూడియోస్. ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసిన సంతోషంగా ఫీలయ్యాను. రెండు లిరికల్ వీడియోలు చూశాను. తమిళ వీడియోలో సింగర్ కి క్రెడిట్ ఇవ్వలేదు. ఇది నన్ను అవమానించినట్లే' అంటూ ట్వీట్ చేశారు.