తిరుపతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నౌషద్ శుక్రవారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 55ఏళ్ల నౌషద్ ఛాతి నొప్పితో కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.  

మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. నిర్మాత, ప్రముఖ చెఫ్ నౌషద్ అకాల మరణం పొందారు. తిరుపతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నౌషద్ శుక్రవారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 55ఏళ్ల నౌషద్ ఛాతి నొప్పితో కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. 


గతంలో కోవిడ్ బారిన పడిన నౌషద్ కోలుకున్నట్లు సమాచారం. విషాదకర విషయం ఏమిటంటే ఆగష్టు 12న నౌషద్ భార్య షీబా గుండె పోటుతో మరణించారు. రెండు వారల వ్యవధిలో తల్లితండ్రులను కోల్పోయిన కూతురు 13ఏళ్ల నష్వా ను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. 


నౌషద్ చేసే రుచికరమైన వంటలంటే సెలబ్రిటీలకు బాగా ఇష్టపడేవారు. ఇక పలు స్థానిక టీవీ చానెళ్లలో కుకరీ షోలతో అలరించే నౌషద్‌ మమ్ముట్టి నటించిన కజా సినిమాతో నిర్మాతగా మారారు. చట్టంబి నాడు, లయన్‌, బెస్ట్‌ యాక్టర్‌, స్పానిష్‌ మసాలా వంటి చిత్రాలను నిర్మించారు.


నౌషద్ మృతికి కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. చిత్ర ప్రముఖులు పృద్విరాజ్, మమ్ముట్టి, మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Scroll to load tweet…