తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి ఇటీవల నోరువిప్పిన నటి శ్రీ రెడ్డి వ్యాఖ్యలు తెలుగు ఇండస్ట్రీలో  జరుగుతున్న సంచలన విషయాలు వెలుగులోకి తెస్తున్నాయి. ఓ ఛానెల్ టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో శ్రీ రెడ్డి పాల్గొంది. తనతోపాటు టాలీవుడ్ నిర్మాత ప్రసన్న కుమార్ కూడా ఆ చర్చా గోష్టిలో పాల్గొన్నారు.

 

ఈ సందర్బంగా శ్రీ రెడ్డి చాలా బోల్డ్ గా మాట్లాడింది. కేవలం వాళ్ల స్పెర్మ్ తుడుచుకునేందుకు కమిట్మెంట్ సరిపోతోంది తప్ప అవకాశాలు ఆరకంగా కూడా ఇవ్వట్లేదని శ్రీ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తెలుగు పరిశ్రమలో బడా నిర్మాతల కొడుకులు కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో వున్నారని శ్రీ రెడ్డి ఆరోపించింది.

 

ఈ సందర్భంగా జరిగిన చర్చా కార్యక్రమంలో నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. గతంలో తన సాక్షిగా.. ఓ పేరుమోసిన హీరోయిన్.. ఓ బడా హీరో సరసన నటించే అవకాశం ఇప్పించాలని ఓ కో ఆర్డినేటర్ ను కోరిందని.. అవసరమైతే పడుకోవటానికి రెడీగా వున్నానని చెప్తుంటే లైవ్ లో విన్నానని ప్రసన్నకుమార్ తెలిపారు. ఆశ్చర్యకరంగా ఆ హిరోయిన్.. అలా ఆఫర్ చేసిన పక్షం రోజుల్లోనే తను కోరుకున్నట్లుగా ఆ బడా హీరో సరసన నటించే అకాశం దక్కించుకుందన్నారు ప్రసన్న కుమార్. ఆ మధ్య గ్యాప్ లో ఏం జరిగిందో కాని... ఆ హిరోయిన్ మాత్రం ఆ బడా హీరో సరసన నటించిందని ప్రసన్న కుమార్ తెలిపారు. ఆమె పేరు "ర" తో మొదలవుతుందట.

 

దీంతో శ్రీ రెడ్డి కలగజేసుకుని.. తెలుగు పరిశ్రమలో వున్న హీరోయిన్లు అంతా.. అలా చేసిన వారేనని, ఒక్కరు కూడా ఆ పని చేయకుండా ఈ స్థాయికి వచ్చారంటే నమ్మటం సాధ్యం కాదని శ్రీ రెడ్డి స్పష్టం చేసింది. ఈ కాస్టింగ్ కౌచ్ ను సమూలంగా నిర్మీలించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం వుందని శ్రీ రెడ్డి డిమాండ్ చేసింది.