Asianet News TeluguAsianet News Telugu

Kalyaan Dhev: కళ్యాణ్ దేవ్ ఇంట్లో శుభకార్యం..శ్రీజ కూతురు స్పెషల్ అట్రాక్షన్, ఫ్యాన్స్ అడుగుతున్నది ఇదే

శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోయి దూరంగా ఉంటున్నారనేది వాస్తవం. శ్రీజ, కళ్యాణ్ దేవ్ లకి ఒక కుమార్తె సంతానం ఉన్న సంగతి తెలిసిందే.

family function at Kalyaan dhev house latest post viral dtr
Author
First Published Dec 22, 2023, 5:11 PM IST

చాలా కాలంగా కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇద్దరూ ప్రస్తుతం విడిగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు. శ్రీజ సోషల్ మీడియాలో కూడా కళ్యాణ్ దేవ్ గురించి ప్రస్తావన లేదు. కళ్యాణ్ దేవ్ కూడా తన ముద్దుల కుమార్తె గురించి పోస్ట్ లు పెడుతున్నాడు కానీ.. శ్రీజతో ఉన్న ఎలాంటి ఫొటోస్ షేర్ చేయడం లేదు. 

శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోయి దూరంగా ఉంటున్నారనేది వాస్తవం. శ్రీజ, కళ్యాణ్ దేవ్ లకి ఒక కుమార్తె సంతానం ఉన్న సంగతి తెలిసిందే. దీనితో తన ముద్దుల కూతురు కళ్యాణ్ దేవ్ వద్ద వారంలో కొన్ని రోజులు ఉంటుంది. మిగిలిన రోజుల్లో తల్లి దగ్గరే ఉంటుంది. తాజాగా శ్రీజ కుమార్తె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అది కూడా కళ్యాణ్ దేవ్ ఇంట్లో. 

కళ్యాణ్ దేవ్ ఇంట్లో శుభకార్యం జరిగింది.  కళ్యాణ్ దేవ్ సోదరి సీమంతం వేడుక ఘనంగా జరిగింది. దీనితో చిన్నారి నవిష్క తన తండ్రి ఇంట్లో సందడి చేసింది. సీమంతంలో కళ్యాణ్ దేవ్ తన అక్క, బావ, తల్లిందండ్రులు, నవిష్క తో సంతోషంగా గడిపాడు. ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)

ఈ ఫోటోలు నెటిజన్లని ఆకర్షించే విధంగా ఉన్నాయి. నెటిజన్లంతా ఈ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు కళ్యాణ్ దేవ్ సినిమాలు కొనసాగించాలని కోరుతున్నారు. శ్రీజ నుంచి విడిపోయిన తర్వాత కళ్యాణ్ దేవ్ నుంచి మూవీ రాలేదు. హీరోగా కళ్యాణ్ దేవ్ ఫిట్ అవుతాడని సినిమాలు కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. 

 శ్రీజకి ఇద్దరు కుమార్తెలు సంతానం. మొదటి భర్త ద్వారా ఒక కుమార్తె కాగా.. కళ్యాణ్ దేవ్ ద్వారా రెండవ కుమార్తె జన్మించారు. ఆ మధ్యన శ్రీజ కళ్యాణ్ దేవ్ తో విభేదాల కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆమె సింగిల్ గా తల్లిదండ్రులతో ఉంటోంది.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios