‘ఉప్పెన’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ రెండో సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై జాగర్లమూడి సాయిబాబు, వై. రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. ఈ సినిమాకు ఇటీవలే ముహూర్తం జరిపారు. తాజాగా వికారాబాద్‌ అడవుల్లో షూటింగ్‌ ప్రారంభించారు.

ఏకధాటిగా 45 రోజులు షూట్‌ చేసి, ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఆ మేరకు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ లోగా ఓ వార్త వచ్చి మెగాభిమానులను కంగారుపెట్టింది. అదేమిటంటే..ఈ సినిమా టీమ్ లో ఒకరికి కరోనా వచ్చిందని, దాంతో షూటింగ్ ఆపేసారని ఆ వార్త సారాంశం. అయితే అందుతున్న సమాచారం మేరకు అటువంటిదేమీ జరగలేదు. అది కేవలం కొందరు గిట్టని వాళ్లో,లేక వార్త కోసం కొందరు మీడియా జనం పుట్టించిన రూమరో అని తేలింది. షూటింగ్ టీమ్ లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఏ విధమైన ఇబ్బంది లేకుండా షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. 

ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ . ‘‘అడవి నేపథ్యంలో జరిగే కథ ఇది. రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టాం. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాని పూర్తి చేయడానికి క్రిష్‌ సన్నాహాలు చేస్తున్నారు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.