విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫలక్‌నుమా దాస్ నేడు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మాస్ ఎంటర్టైనర్ తరహాలో విశ్వక్ అటు హీరోగా ఇటు దర్శకుడిగా బాధ్యతలు మోసి ఓ వర్గం వారిని తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్ సపోర్ట్ తో సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు. యూఎస్ లో ప్రీమియర్స్ ను కూడా ప్రదర్శించారు. 

టీజర్ - ట్రైలర్స్ తో యూత్ ని మాస్ ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా తెరపై అద్భుతంగా ఉందని టాక్ వస్తోంది. సినిమాలో విశ్వక్ సేన్ తన డిఫరెంట్ షేడ్స్ తో విజిల్స్ వేయించాడని చెప్పవచ్చు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ప్లస్ అయ్యింది. తరుణ్ భాస్కర్ పోలీస్ పాత్రలో ఆకట్టుకోగా పాండు అనే మరో పాత్ర కూడా ఆడియెన్స్ కి నచ్చుతుంది. 

ఊర మాస్ లో ఫలక్‌నుమా దాస్ ఆకట్టుకుంటాడని చెప్పవచ్చు. అనుకోకుండా జరిగే గ్యాంగ్ వార్ ల కారణంగా దాస్ అలాగే అతని అనుచరులు పోలీసులకు చిక్కుతారు. ఆ తరువాత సినిమా క్రైమ్ పాయింట్ చుట్టూ నడుస్తుంది. 

సినిమాలో డైలాగ్స్ మరో లెవెల్లో ఉన్నాయి. సెట్స్ కూడా సినిమాకు మరో ప్లస్ పాయింట్. కథ కళ్ళముందే జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. మొత్తానికి ఫలక్‌నుమా దాస్ ఎదో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడని ప్రవాసులు చెబుతున్నారు. అయితే అక్కడక్కడా కొన్ని సీన్స్ బోర్ కొట్టించే అవకాశం ఉంది. మరి క్లాస్ ఆడియెన్స్ ని సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.