వైవా హర్షను అనాధ చేసేశారు!

fake story about viva harsha in youtube channel
Highlights

'వైవా' అనే షార్ట్ ఫిలింతో పాపులర్ అయిన హర్ష ఆ తరువాత నుండి ఆ షార్ట్ ఫిలిం పేరే తన ఇంటి పేరుగా

'వైవా' అనే షార్ట్ ఫిలింతో పాపులర్ అయిన హర్ష ఆ తరువాత నుండి ఆ షార్ట్ ఫిలిం పేరే తన ఇంటి పేరుగా మారిపోయింది. దీని తరువాత సినిమాలలో కూడా అవకాశాలు సంపాదించుకున్నాడు. అటువంటి తనకు అనాధను చేసేశారని వాపోయాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్ష ఓ యూట్యూబ్ ఛానెల్ వారు తనను అనాధను చేసినట్లు చెప్పుకొచ్చారు.

ఈ మధ్య కాలంలో యూట్యూబ్ పై చాలా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వ్యూస్ కోసం తమకు నచ్చిన వీడియోలు చేస్తూ కష్టపడి పని చేసే వారి క్రెడిబిలిటీ తగ్గిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైవా హర్షపై కూడా ఓ యూట్యూబ్ ఛానెల్ వారు స్టోరీ చేశారట. అందులో ఓ అనాధ ఈ స్థాయిని ఎలా ఎదిగారో చూడండి అంటూ ఓ స్టోరీను క్రియేట్ చేశారట. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని అంటున్నాడు వైవా హర్ష.

తనకు తల్లితండ్రులు ఉన్నారని..తమ తల్లి స్వయంగా ఈ వీడియో తీసుకొచ్చి తనకు చూపించిందని హర్ష వెల్లడించారు. ఇటువంటి వీడియోలను చేయడం వలన జెన్యూన్ కంటెంట్ చేసేవాళ్లకు యూట్యూబ్ లో విలువ లేకుండా పోతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక వైవా షార్ట్ ఫిలిం తరువాత అతడికి నటుడిగా అవకాశాలు వచ్చాయని సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం సినిమాలలో అవకాశాలు ఇప్పించారని చెప్పుకొచ్చాడు. 
 

loader