దొంగనోట్లు ముద్రిస్తోన్న టీవీ నటి అరెస్ట్!

Fake Currency Case: Malayalam TV actress arrested
Highlights

దొంగనోట్లు ముద్రిస్తోన్న కేసులో టీవీ నటిని అలానే తన తల్లి, సోదరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మలయాళంలో టీవీ సీరియళ్లలో నటిస్తోన్న సూర్య శశికుమార్(36), ఆమె సోదరి శ్రుతి, తల్లి రీమాదేవీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దొంగనోట్లు ముద్రిస్తోన్న కేసులో టీవీ నటిని అలానే తన తల్లి, సోదరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మలయాళంలో టీవీ సీరియళ్లలో నటిస్తోన్న సూర్య శశికుమార్(36), ఆమె సోదరి శ్రుతి, తల్లి రీమాదేవీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొల్లంలోని తమ ఇంట్లోఈ ముగ్గురు దొంగ నోట్లు ముద్రిస్తున్నారనే కేసులో కొచ్చిలో అరెస్ట్ చేసినట్లు ఇడుక్కి జిల్లా పోలీస్ అధికారి వెల్లడించారు.

ఈ కేసులో నిందితురాలిగా నటి తల్లిని అనుమానిస్తున్నారు. ఇటీవల ఇడుక్కి ప్రాంతంలో రెండు లక్షల పాతిక వేల నకిలీ నోట్లను తరలిస్తోన్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలా పట్టుబడ్డ వారు ముగ్గురు వ్యక్తులు నటి సూర్య శశికుమార్, ఆమె సోదరి, తల్లి పేర్లను వెల్లడించారు. ఈ మేరకు వారి ఇంటిపై సోదాలు నిర్వహించిన పోలీసులకు రూ.57 లక్షల విలువైన దొంగనోట్లు దొరికాయి. వాటిని సీజ్ చేసి నటి కుటుంబాన్ని అరెస్ట్ చేశారు.

ఈ దొంగనోట్లను ముద్రించడానికి దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఆరుగురిని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. 

loader