ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'ఎఫ్ 2' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు రూ.60 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా ఫుల్ రన్ లో ఎనభై కోట్లు వసూళ్లు సాధించడం ఖాయమని అంటున్నారు.

ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని సినిమా ఎండింగ్ టైటిల్స్ లోనే చెప్పేశారు. రీసెంట్ గా జరిగిన సినిమా సక్సెస్ మీట్ లో కూడా దర్శకుడు ఇదే టీంతో 'ఎఫ్ 3' ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలో క్లారిటీ వచ్చేసింది.

తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు అనీల్ రావిపూడి, దిల్ రాజు 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. 'ఎఫ్ 3' సినిమా కచ్చితంగా ఉంటుందని చెప్పిన దర్శకుడు ఇంకా సినిమా లైన్ డెవలప్ స్టేజ్ లో ఉందని అన్నారు.

'ఎఫ్ 2' లో నటించిన కమెడియన్స్ శ్రీనివాస రెడ్డి, రఘుబాబు, గన్ మ్యాన్ ల పాత్రలు మరింత నిడివితో ఉంటాయని చెప్పారు. 2021 సంక్రాంతికి'ఎఫ్ 3' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తామని స్పష్టం చేశారు. ఈలోగా అనీల్ రావిపూడి బయట బ్యానర్ లలో ఎలా లేదన్నా రెండు సినిమాలు పూర్తి చేస్తాడని తెలుస్తోంది.