విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటీనటులుగా, అనిరావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఎఫ్3 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతాగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్రయూనిట్ ‘ఫస్ట్ సింగిల్’ లిరికిల్ వీడియోను రిలీజ్ చేసింది. 

‘ఎఫ్2’తో తెలుగు ఆడియెన్స్ ను ఎంతగానో నవ్వించారు అనిల్ రావిపూడి. దానికి సీక్వెల్ గా తీసిన ‘ఎఫ్3’ మూవీతో ఇక మరోసారి నవ్వుల పండుగ ప్రారంభం కానుంది. తొలుత పాటలతో ఈ చిత్రం ఆకట్టుకోనుంది. ఈ మేరకు ఫస్ట్ సింగిల్ ‘లబ్ డబ్ అబ్ డబ్.. డబ్బూ..’ లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

 విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథనాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించి తెరకెక్కించిన మూవీ ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్లను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఫస్ట్ సింగిల్ ను ఈరోజు రిలీజ్ చేశారు. 

Scroll to load tweet…

‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ.. డబ్బూ.. ఎవడు కనిపెట్టాడో దీన్ని గాని అబ్బో.. కాసులుంటే తప్ప కల్లు ఎత్తి చూడరబ్బో.. చిల్లిగవ్వ లేకుంటే నువ్వు పిండి రుబ్బో.. డబ్బూ.. డబ్బూ.. ప్యాకెట్ లోనా పైసా ఉంటే ప్రపంచమే పిల్లి అవుతుంది.. పులై మనం బతకచ్చు.. విశ్వదాభిరామా..’ అంటూ సాగిన పాట ఆసాంతం సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉంది. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ ఈ లిరికల్ వీడియోలో ఆడిపాడి ఆడియెన్స్ లో జోష్ పెంచారు. డబ్బు ప్రాధాన్యతను తెలిపే ఈ పాట ప్రస్తుతం య్యూటూబ్ లో ట్రెండ్ అవుతోంది. రిలీజ్ అయిన గంటలోనే దాదాపు 3 లక్షల వ్యూస్ సాధించింది. 

ఈ సాంగ్ కు రామ్ మిరియాల గాత్రం అందించగా, లిరిసిస్ట్ భాస్కరభట్ల చక్కటి లిరిక్స్ రాశారు. ఇక రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ క్యాచీ ట్యూన్ అందించడంతో ఆడియెన్స్ కు తెగ నచ్చేస్తోంది ఈ సాంగ్. సాంగే ఇంత ఎంటర్ టైన్ గా ఉంటే ఇక సినిమా అదిరిపోతుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతూ మూవీ పట్ల ఉన్న ఆసక్తిని చూపుతున్నారు. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నవ్వులు పూయిస్తుందని ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావుపూడి చెప్పిన విషయం తెలిసిందే.