భార్యా బాధితులుగా వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లు  తెగ నవ్వించేసి, డబ్బులు సంపాదించేసారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వీరిద్దరూ హీరోలుగా నటించిన చిత్రం ‘ఎఫ్‌2: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్. భార్యల వల్ల హీరోలు  ఫ్రస్ట్రేషన్‌కు గురవుతూ  ఫన్‌ పంచటం ప్రేక్షకులకు  తెగ నచ్చేసింది. క్రితం సంక్రాంతికి థియేటర్‌కు వచ్చిన ఈ అల్లుళ్లు జోరుకు డిస్ట్రిట్యూటర్స్ ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు.

 ఈ నేపధ్యంలో కన్నడ వెర్షన్ సైతం నవ్వించటానికి సిద్దమైంది. స్టార్ సువర్ణలో ఈ చిత్రం కన్నడ డబ్బింగ్ వెర్షన్ త్వరలో అలరించబోతోంది. ఈ మేరకు ప్రకటన వచ్చింది. కన్నడ డబ్బింగ్ రైట్స్ సైతం దిల్ రాజు మంచి రేటుకు అమ్మినట్లు సమాచారం. కన్నడ టీవిల్లో ఈ సినిమా అదరకొడుతుందని నమ్ముతున్నారు.
  
 శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో హీరో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటించగా.. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, రఘబాబు, నాజర్, అన్నపూర్ణ, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.