వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి రూపొందించిన 'ఎఫ్ 2' సినిమా సంక్రాంతికి విడుదలైన పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై భారీ లాభాలను తీసుకొచ్చింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో తొలగించిన కొన్ని సన్నివేశాలను నిర్మాత దిల్ రాజు తన యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే రెండు కామెడీ సీన్స్ విడుదల చేసిన దిల్ రాజు తాజాగా మరో కామెడీ సీన్ వదిలాడు. 

ఇందులో మెహ్రీన్ పాట పాడుతుంటే వెంకటేష్ ఫ్రస్ట్రేట్ అవుతూ చెప్పే డైలాగులు హైలైట్ గా నిలిచాయి. ఆ సీన్ మీరు కూడా ఒకసారి చూసేయండి!