ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాల్లో 'ఎఫ్ 2' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ విడుదలకు ముందు పరిస్థితి మాత్రం ఇలా లేదు. 'వినయ విధేయ రామ', 'ఎన్టీఆర్ బయోపిక్' ల ముందు అసలు 'ఎఫ్ 2' నిలుస్తుందా..? అనే సందేహాలు కలిగాయి.

ఆ రెండు భారీ సినిమాలకు బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది. అందరూ 'వినయ విధేయ రామ', 'ఎన్టీఆర్ బయోపిక్' ల గురించే మాట్లాడుకున్నారు. కానీ ఆ రెండు సినిమాలను దాటేసి కలెక్షన్ల విషయంలో దూసుకుపోతుంది 'ఎఫ్ 2'. ఇంత పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించలేదు.

ఇప్పుడు సినిమా షేర్ రూ.60 కోట్లు దాటేసింది. ఫుల్ రన్ లో రూ.80 నుండి 100 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో 'ఎఫ్ 2' ఎంత వసూలు చేసిందో.. మిగిలిన రెండు సినిమాలు కలిపి అంత వసూలు చేశాయి.

వినయ విధేయ రామ షేర్ అరవై కోట్లు వస్తే.. ఎన్టీఆర్ బయోపిక్ ఇరవై కోట్లతో సరిపెట్టుకుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రెండు సినిమాల షేర్ 'ఎఫ్ 2' ఫుల్ రన్ షేర్ కు సమానంగా ఉండేలా ఉంది. రెండు భారీ బడ్జెట్ చిత్రాలను అధిగమించి ఈ రేంజ్ లో 'ఎఫ్ 2' విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు.