హిట్టయితే ఆఫర్స్ రావడం కామన్. అయితే ఈ రోజుల్లో హిట్స్ అందుకున్న హీరోయిన్స్ కి అంత ఈజీగా ఆఫర్స్ రావడం లేదు. సినిమా బాక్స్ ఆఫీస్ హిట్టయినా కూడా కొత్త ప్రాజెక్ట్స్ లలో సరితూగితేనే ఆఫర్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా F2 సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నా కూడా తమన్నా - మెహ్రీన్ లకు పెద్దగా ఛాన్సులు ఏమి రావడం లేదు. 

మొన్నటి వరకు సక్సెస్ లేదు  కాబట్టి ఆఫర్స్ లేవని అనుకున్నారు. కానీ ఇప్పుడు 100 కోట్లకు పైగా బిజినెస్ చేసిన సినిమాతో మెరిసినా కూడా పాపం బ్యూటీలను పట్టించుకోరే? అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ఆ సినిమా సక్సెస్ లో ఎక్కువ క్రెడిట్ వెంకీకి వెళ్లగా ఇంకాస్త దర్శకుడు అనిల్ మరో హీరో వరుణ్ క్రెడిట్ ను పంచుకున్నారు. 

దీంతో తమన్నా - మెహ్రీన్ ల పాత్రలు గ్లామర్ కోసమే నటించారు అనే ముద్ర పడిపోయింది. ఇక ప్రస్తుతం తమన్నా వద్దకు ఒకటి రెండు ఆఫర్స్ వస్తున్నప్పటికీ రెమ్యునరేషన్ ని పెంచడం లేదని టాక్. సక్సెస్ కొట్టినా కూడా అవకాశాలు లేకపోవడమే కాకుండా ఫీజులో కూడా బేబీలకి అదృష్టం కలిసి రావడం లేదు. మరి నెక్స్ట్ ఎలాంటి సినిమాలతో సక్సెస్ అవుతారో చూడాలి.