పండగ సీజన్ కు సరిగ్గా సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా వచ్చి సూపర్ హిట్టైన చిత్రం ‘ఎఫ్-2’. వెంకటేష్-వరుణ్ తేజ్ క్రేజీ కాంబినేషన్లో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు.
పండగ సీజన్ కు సరిగ్గా సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా వచ్చి సూపర్ హిట్టైన చిత్రం ‘ఎఫ్-2’. వెంకటేష్-వరుణ్ తేజ్ క్రేజీ కాంబినేషన్లో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఈ చిత్రం కలెక్షన్స్ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయ్యినా ఇప్పటికీ దుమ్ము రేపుతున్నాయి.
ముఖ్యంగా సంక్రాంతి బరిలో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు , పేట , వినయ విధేయ రామ చిత్రాలు ఘోర పరాజయం సాధించడంతో ఎఫ్ 2 కు బాగా కలిసి వచ్చింది. అయితే ఇప్పుడు వాటికి అమెజాన్ ప్రైమ్ ద్వారా దెబ్బపడనుందా అంటే అవుననే చెప్పాలి. అందుతున్న సమాచారం మేరకు 'ఎఫ్ 2: ఫన్ & ఫ్రస్టేషన్' చిత్రం అమెజాన్ లో లైవ్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.
ఈనెల 11నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది. ఎఫ్ 2 ఇప్పటికే 25 రోజులు పూర్తి చేసుకుని... దాదాపు 80 కోట్ల మేర షేర్ రాబట్టింది. ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే మరో ఐదు రోజుల్లో అంటే ఫిబ్రవరి 11న డిజిటల్ లో లైవ్ లోకి వచ్చేయటం డిస్ట్రిబ్యూటర్స్ ని కాస్త ఇబ్బంది పెడుతోంది.
ఈ రోజుకీ ఎఫ్ 2 చిత్రం చక్కని వసూళ్లు సాధిస్తూ.. ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే అమెజాన్‌లో రిలీజ్ చేసేస్తుండడం పద్దతి కాదంటున్నారు. అయితే నెలరోజుల్లో డిజిటల్ రిలీజ్ చేసుకునేలా నిర్మాత దిల్ రాజు అమెజాన్ తో మొదటే ఎగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ ప్రకారమే ఈ చిత్రం డిజిటల్ లో లైవ్ కి వస్తోంది.
