Asianet News TeluguAsianet News Telugu

'రెడ్', 'సోలో బ్రతుకే సో బెటర్' రిలీజ్ కు కొత్త ట్విస్ట్?

 ఓటీటికు ఒప్పుకోకుండా ఇలా థియోటర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సినిమాలు చాలా ఉన్నా ఈ రెండింటి లెక్క వేరు.ఈ రెండు సినిమాలని చాలా కాలం క్రితమే డిస్ట్రిబ్యూటర్స్ కొన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో రీఎగ్రిమెంట్ చేసుకోవాలని ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కోరుతున్నట్లు తెలుస్తోంది.  అయినా ఇప్పుడున్న పరిస్దితుల్లో డిస్ట్రిబ్యూటర్స్ ...కొత్త సినిమా రిలీజ్ ల కోసం అడ్వాన్స్ లు ఇచ్చే పరిస్దితి లేదని చెప్తున్నారు.

Exhibitors distributors want sharing of revenue and expenses jsp
Author
Hyderabad, First Published Oct 15, 2020, 8:33 AM IST

రామ్ ..రెడ్ సినిమా, సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ థియోటర్ రిలీజ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాయి. ఓటీటికు ఒప్పుకోకుండా ఇలా థియోటర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సినిమాలు చాలా ఉన్నా ఈ రెండింటి లెక్క వేరు.ఈ రెండు సినిమాలని చాలా కాలం క్రితమే డిస్ట్రిబ్యూటర్స్ కొన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో రీఎగ్రిమెంట్ చేసుకోవాలని ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కోరుతున్నట్లు తెలుస్తోంది. 
అయినా ఇప్పుడున్న పరిస్దితుల్లో డిస్ట్రిబ్యూటర్స్ ...కొత్త సినిమా రిలీజ్ ల కోసం అడ్వాన్స్ లు ఇచ్చే పరిస్దితి లేదని చెప్తున్నారు.

 దానికి తోడు కేంద్ర ప్రభుత్వం 50  శాతం ఆక్యుపెన్సీతో ఫర్మిషన్ ఇచ్చింది. అంత తక్కువ సీటింగ్ తో పెద్ద సినిమాలకు భారీగా డబ్బులు కట్టి డిస్ట్రిబ్యూటర్స్ రిస్క్ తీసుకోలేమని చెప్తున్నారు. శానిటైజేషన్, 50 శాతం మాత్రమే సీటింగ్ వంటి వాటితో థియోటర్ మెయింటినెన్స్, ఖర్చులు బాగా పెరుగుతాయి. లాభాలు బాగా తగ్గుతాయి. దాంతో ఖర్చులు, రెవిన్యూ రెండూ షేరింగ్ చేసుకునేటట్లు పెట్టుకుంటే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్స్ అడుగుతున్నట్లు సమాచారం. అలా చేసినా ఇప్పటికిప్పుడు అయితే సినిమాలు రిలీజ్ కావు.

 అన్‌లాక్‌ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 15 నుంచి ఆయా రాష్ట్ర   ప్రభుత్వాల అనుమతితో థియేటర్లు తెరుచుకోవచ్చని జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 15 రాష్ట్రాలు ఫర్మిషన్స్ ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  అనుమతి ఇచ్చినా, తెలంగాణ ఇవ్వలేదు. అలాగే ఏపీ సినీ ఎగ్జిబిటర్స్ సంఘం మాత్రం గురువారం నుంచి థియేటర్లు తెరవకూడదని నిర్ణయించింది. లాక్‌డౌన్‌ కాలానికి థియేటర్ల విద్యుత్‌ ఛార్జీలు మాఫీ చేయాలనే డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూడాలంటే కొంత కాలం ఆగాల్సిన పరిస్దితి ఏర్పడింది. 

మరో ప్రక్క దేశవ్యాప్తంగా 3100 మల్టీప్లెక్స్‌ థియేటర్లలో చాలా భాగం ఈ రోజు రీ ఓపెన్ కాబోతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో  సింగిల్ స్క్రీన్స్  మాత్రం అక్బోటర్ 15 నుంచి రీఓపెన్ చేయాలనే తమ ప్లాన్స్ ని మార్చుకున్నాయి. ముందునుంచి అనుకుంటున్నట్లు గానే సింగిల్ స్క్రీన్స్ రీఓపెన్ కు చాలా ఇష్యూలు ఉన్నాయి. మొదటగా స్టార్స్ తో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలు కావాలి. లేకపోతే ఇక్కడ మనవాళ్లు లైట్ తీసుకుంటారు. మరో ప్రక్క రెండు రాష్ట్రాల్లోనూ ఎడతెగని వర్షాలు, కరోనా పరిస్దితులు కూడా ఓ కొలిక్కి రాలేదు. వీటిన్నటి నేపధ్యంలో సినిమా హాళ్లు ఓపెన్ చేసినా ఎంతమంది వస్తారనేది పెద్ద ప్రశ్నే.  
 

Follow Us:
Download App:
  • android
  • ios