భారత మాజీ ప్రధాని, బిజెపి నేత అటల్ బిహారి వాజ్ పేయి జీవితం ఆధారంగా చిత్రం తెరకెక్కబోతోంది. ప్రధానిగా ఆయన దేశానికీ ఎనలేని సేవలు అందించారు. కీర్తి ప్రతిష్ఠలు సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఆగష్టు 16న వాజ్ పై మరణించిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఆయన బయోపిక్ పై ప్రకటన వచ్చింది. ఉల్లేక్ అనే రచయిత వాజ్ పేయి జీవితం చరిత్రపై ' ది అన్ టోల్డ్ వాజ్ పేయి' అనే పుస్తకాన్ని రచించారు. అమాష్ ఫిలిమ్స్ అనే సంస్థ ఈ పుస్తక హక్కులని సొంతం చేసింది. ఈ పుస్తకం ఆధారంగా వాజ్ పేయి బయోపిక్ తెరకెక్కించబోతున్నట్లు సంస్థ నిర్మాతలు శివ శర్మ, జీషాన్ ప్రకటించారు. 

వాజ్ పేయి బాల్యం నుంచి విద్యాబ్యాసం, రాజకీయ నాయకుడిగా, ప్రధానిగా సాధించిన విజయాలు ఇలా అన్ని అంశాలని సినిమాలో చూపిస్తాం అని అంటున్నారు. ఈ బయోపిక్ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాగానే దర్శకుడు, నటీ నటుల్ని ప్రకటిస్తామని తెలిపారు.