నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన దివంగత దర్శకనిర్మాత ఈవీవీ సత్యనారాయణ తల్లి, సినీ నటుడు అల్లరి నరేష్ నాయనమ్మ ఈదర వెంకటరత్నమ్మ(87) సోమవారం నాడు కన్నుమూశారు.

2011లో ఈవీవీ మరణించిన తరువాత నుండి వెంకటరత్నమ్మ కోరుమామిడిలోనే నివసిస్తున్నారు. వయసు పైబడడంతో అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె తన స్వగృహంలోనే మృతి చెందారు.

అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, దర్శకుడు ఈవీవీ సత్తిబాబు, నిర్మాతా కానుమిల్లి అమ్మిరాజు వంటి వారు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈదర వెంకట్రావు, వెంకరత్నమ్మ దంపతులకు ఈవీవీ సత్యనారాయణ, గిరి, శ్రీనివాస్‌ ముగ్గురు కుమారులుండగా, కుమార్తె ముళ్లపూడి మంగ ఉన్నారు.