తొలి ఎపిసోడ్‌కు రామ్ చరణ్ వచ్చాడు. ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరూ రావడంతో తొలి ఎపిసోడ్‌పై అంచనాలు పెరిగిపోయాయి. అప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు బాగా వైరల్ అవుతున్నాయి.
అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన క్షణాలు వచ్చేసాయి. ఎవరు మీలో కోటీశ్వరులు షో తొలి ఎపిసోడ్ టెలీకాస్ట్ అయ్యింది. దాదాపు నాలుగేళ్ళ తర్వాత మళ్లీ బుల్లితెరపై దర్శనమిచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. హీరోగా పూర్తి స్దాయిలో బిజీగా ఉన్నా డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ మరోసారి బుల్లితెరపై కనిపిస్తున్నాడు తారక్. గతంలో బిగ్ బాస్ సీజన్ 1తో ఈయన హోస్టుగా మారితే...ఆ షో బ్లాక్‌బస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు జూనియర్. ఇన్నాళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి అదరకొట్టాడు. ఎవరు మీలో కోటీశ్వరులు షో ఆగస్ట్ 22 రాత్రి 8.30 నిమిషాలకు ప్రీమియర్ మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు రామ్ చరణ్ వచ్చాడు. ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరూ రావడంతో తొలి ఎపిసోడ్‌పై ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి. దానికి తోడు అప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపధ్యంలో షోలో ఏమి ప్రశ్నలు..ఎన్టీఆర్ అడిగారు..రామ్ చరణ్ ఏమి సమాధానం చెప్పారో చూద్దాం.
మొదట ఎపిసోడ్ బాగా క్లిక్ అయ్యింది. దాంతో అదే ఉషారుని కొనసాగిస్తూ నెక్ట్స్ ఎపిసోడ్ సోమవారం వచ్చేసింది. రూ.1,60,000 విలువైన ప్రశ్నతో ప్రారంభమైన తాజా ఎపిసోడ్ ఆద్యంతం ఇంట్రస్టింగ్ గా సాగింది. ఓ ప్రశ్నకు సమాధానం తెలియక లైఫ్ లైన్ ద్వారా రామ్ చరణ్.. నటుడు రానాని సంప్రదించారు. చరణ్, తారక్, రానా.. ఈ ముగ్గురి మధ్య సాగిన సంభాషణ ఆకట్టుకుంది. ఇంతకీ ఏ ప్రశ్నకు సమాధానం కోసం చరణ్ రానాకి ఫోన్ చేశారు..? ఎంత మొత్తం గెలుచుకున్నారు?
9. జూన్ 2020లో ఇండియా- చైనా మధ్య వివాదం తలెత్తిన గల్వాన్ లోయ ఏ ప్రాంతంలో ఉంది?
ఎ) లద్దాఖ్ బి) హిమాచల్ ప్రదేశ్ సి) రాజస్థాన్ డి) అరుణాచల్ ప్రదేశ్
సమాధానం: లద్దాఖ్.
10. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో లైవ్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శించిన మొట్ట మొదటి భారతీయ చిత్రం ఏది?
ఎ) బాహుబలి: ది బిగినింగ్ బి) దంగల్ సి) 2.0 డి) కె.జి.యఫ్: ఛాప్టర్ 1
సమాధానం: బాహుబలి.
11. 1971 బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో మునిగిపోయిన జలాంతర్గామి పి.ఎన్.ఎస్. ఘాజీ అసలు పేరేంటి?
ఎ) చెరోకీ బి) హెర్క్యులీస్ సి) ఫోర్డ్ డి) డియాబ్లో
సమాధానం: డియాబ్లో.
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకే చరణ్ ‘వీడియో కాల్ ఆఫ్ ఫ్రెండ్’ ఆప్షన్‌ని ఎంపిక చేసుకున్నారు. రానా సరైన సమాధానం చెప్పి చరణ్‌ని గెలిపించారు.
12. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సెబాస్టియన్ వెట్టెల్ 2021 సీజన్‌లో ఏ ఫార్ములా 1 టీమ్‌కి డ్రైవ్ చేస్తున్నారు?
ఎ) రెడ్‌బుల్ బి) విలియమ్స్ సి) ఆస్టన్ మార్టిన్ డి) మెక్‌లారెన్
సమాధానం: ఆస్టన్ మార్టిన్.
13. ఏ పాలకుడి దగ్గర బ్యూసిఫాలస్ అనే యుద్ధాశ్వం ఉండేది?
ఎ) అశోక ది గ్రేట్ బి) అక్బర్ ది గ్రేట్ సి)అలెగ్జాండర్ ది గ్రేట్ డి) ఆల్ఫ్రెడ్ ది గ్రేట్
సమాధానం: అలెగ్జాండర్ ది గ్రేట్.
ఇక ఈ ప్రశ్నకు సమాధానం కోసం చరణ్ ‘50-50’ లైఫ్‌ని వినియోగించుకున్నారు. సరైన సమాధానం చెప్పి రూ.25,000,00 గెలుచుకున్నారు. దాంతో కర్టెన్ రైజర్ ముగిసింది. చరణ్ గెలుచుకున్న 25 లక్షలను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు అందజేస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.
