యువ హీరో అడివి శేష్ సొంతంగా కథలను రాసుకుంటూ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. క్షణం సినిమా తరువాత గూఢచారి తో తన మార్కెట్ ను మరింత పెంచుకున్న ఈ యువ హీరో ఇప్పుడు మరోసారి ఎవరు సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద లాభాలను అందుకున్నాడు. 

సస్పెన్స్ మర్డర్ మిస్టరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎవరు సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో కంటెంట్ ఆడియెన్స్ కి కనెక్ట్ అవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు. దీంతో వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ అందాయి. 10కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఎవరు ఫైనల్ గా పది కోట్ల షేర్స్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే సినిమాకు డబ్బింగ్ రైట్స్ ద్వారా అలాగే డిజిటల్ మార్కెట్ లో మంచి రేటు దక్కడంతో 5కోట్ల లాభాలను అందుకుంది. సినిమా బడ్జెట్ కూడా 4కోట్లలోపే అని తెలుస్తోంది. మొత్తంగా అడివి శేష్ సినిమాపై నమ్మకంతో బిజినెస్ చేసిన వారికీ లాభాల్ని అందించాడు. ఇక నెక్స్ట్ మేజర్ సినిమాతో రెడీ అవుతున్న శేష్ గూఢచారి సీక్వెల్ ని కూడా త్వరలో స్టార్ట్ చేసేందుకు ప్లాన్  చేస్తున్నాడు.