టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్స్ మధ్య పోటీ చాలా పెరిగిపోయింది. హిట్ అందుకున్న హీరోయిన్స్ వరుసగా అవకాశాలు దక్కించుకోవడంతో ఎప్పటికప్పుడు నెంబర్ వన్ స్థానం లెక్కలు మారుతున్నాయి. అమీ తుమీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఆ తరువాత కొన్ని మంచి అవకాశాలను అందుకుంది. 

అయితే  స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే లెవెల్ కి రాలేదు. దీంతో ఇప్పుడు ఈషా బ్యూటీ తన ఆశలన్నిటిని ఎన్టీఆర్ సినిమాపైనే పెట్టుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమాలో ఈషా నటించింది. మెయిన్ రోల్ కాకపోయినప్పటికీ కథలో కీలకమైన పాత్ర కావడంతో తప్పకుండా కెరీర్ కి ఇదొక మంచి బ్రేక్ అని అమ్మడు గట్టి నమ్మకంతో ఉందట. మరి ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి. 

అరవింద సమేతలో కథానాయికగా పూజ హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 11న సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇక త్వరలోనే హైదరాబాద్ లో సినిమాకు సంబందించిన భారీ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.