సెక్సీ ఫోజులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచే నటి ఈషా గుప్తాకు స్వాతంత్ర దినోత్సవం రోజున చేదు అనుభవం ఎదురైంది. తన ట్విట్టర్ ఖాతాని కొందరు హ్యాక్ చేశారని ఈషా గుప్తా ప్రకటించింది. తనపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుండడంతో ఈషా స్పందించింది. 

ఈషా గుప్తా ట్విట్టర్ ఖాతా నుంచి ఆగష్టు 15న 'అందరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు' అనే ట్వీట్ పోస్ట్ అయింది. ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే అనుకుంటోందని నెటిజన్లంతా ఆమెపై దుమ్మెత్తిపోయడం ప్రారంభించారు. కనీసం స్వాతంత్ర దినోత్సం ఎప్పుడో కూడా ఆమెకు తెలియదా అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. 

తనపై ట్రోలింగ్ ఎక్కువవుతుండడంతో ఈషా గుప్తా స్పందించింది. ఆయా ట్వీట్ తాను చేయలేదని, తన ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైందని వివరణ ఇచ్చింది. ఆ పోస్ట్ ని తొలగించిన తర్వాత అందరికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అని ఈషా తెలిపింది. తాను ఓ ఎయిర్ ఫోర్స్ అధికారి కుమార్తెని అని, ఏ పండుగ ఎప్పుడో తనకు తెలుసు అని క్లారిటీ ఇచ్చింది.