బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తాకు ఒక హోటల్ యజమాని కారణంగా చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. రీసెంట్ స్నేహితులతో సినిమా గ్రాండ్ గా రిలీజైన సందర్బంగా పార్టీ చేసుకున్న ఈషా చివరలో ఒక వ్యక్తి వల్ల తీవ్ర మాస్థాపానికి గురైనట్లు సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. 

అతను తనను రేప్ చేసేలా ప్రవర్తించాడని ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నప్పటికీ ఒక పశువులా ప్రవర్తించి తీవ్ర అసహనానికి గురి చేసినట్లు  తెలిపింది. వన్‌ డే: జస్టిస్‌ డెలివర్డ్‌’ సినిమా  రిలీజైన సందర్బంగా పార్టీ చేసుకున్న అమ్మడిని చివరికి రోహిత్ అనే హోటల్ యజమాని అసభ్యంగా ప్రవర్తించాడట. ఇద్దరు బాడీ గార్డ్స్ ఉన్న కూడా విచక్షణారహితంగా ప్రవర్తించడాని అది తనకు చాలా అసౌకర్యంగా అనిపించందని ఆమె తెలిపింది. 

కొంచెమైతే అత్యాచారం చేసేవాడు అన్నట్లుగా ఈషా వివరణ ఇస్తూ ఇలాంటి వ్యక్తుల వల్ల భవిష్యత్తులో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సెలబ్రెటీ అయినా నాకే ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది అంటే సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అని వ్యాఖ్యానించారు. చివరగా రోహిత్ నువ్వు నాశనమవ్వాలి అని పేర్కొన్న ఈషా అతనెవరో మీకు తెలుసా అంటూ కామెంట్ చేశారు.