Asianet News TeluguAsianet News Telugu

హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో `ఫ్లెష్‌`

ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా థ్రిల్లింగ్ క్రైమ్‌ డ్రామా ఫ్లెష్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది ఈరోస్‌ సంస్థ. ఈ షో ఆగస్ట్‌ 21న ప్రసరాం కానుంది. ఈ వెబ్‌ సిరీస్‌లో భాగంగా 40 నిమిషాల నిడివితో 8 ఎపిసోడ్స్‌ రిలీజ్ చేస్తున్నారు.

Eros Now brings forth a riveting tale of human trafficking Flesh starring Swara Bhaskar and Akshay Oberoi
Author
Hyderabad, First Published Aug 11, 2020, 4:36 PM IST

ఈరోస్‌ సంస్థ రోజు రోజుకు తన ప్రేక్షకులను ప్రపంచవ్యాప్తంగా పెంచుకుంటూ పోతోంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్, ఎంటర్‌టైనింగ్‌, ఇన్నొవేటివ్‌ కంటెంట్‌తో వ్యూవర్స్‌ను ఆకట్టుకుంటుంది.  తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా థ్రిల్లింగ్ క్రైమ్‌ డ్రామా ఫ్లెష్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ షో ఆగస్ట్‌ 21న ప్రసరాం కానుంది. ఈ వెబ్‌ సిరీస్‌లో భాగంగా 40 నిమిషాల నిడివితో 8 ఎపిసోడ్స్‌ రిలీజ్ చేస్తున్నారు.

ఈ షోలో స్వర భాస్కర్, అక్షయ్‌ ఓబెరాయ్‌, యుధిస్టర్‌, విద్యా వల్వాదే, మహిమా మ్వానలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ షోను హ్యామన్ ట్రాఫికింగ్‌ నేపథ్యంలో  క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో హ్యూమన్‌ ట్రాఫికింగ్ కూడా ఒకటి. మనుషుల రక్త మాంసాలతో జరిగే ఈ వ్యాపారాన్ని తగ్గట్టుగా ఈ వెబ్‌ సిరీస్‌కు ఫ్లెష్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

పూజ లడ్డా శృతి కథ అందించగా సిద్ధార్థ్‌ ఆనంద్ క్రియేషన్‌లో దనీష్ అస్లమ్‌ దర్శకత్వం వహించారు. ఈ షో ప్రేక్షకులను థ్రిల్‌ చేయటమే కాదు, ఒక్క ఎపిసోడ్‌ ఒక్కో ట్విస్ట్‌తో ఆసక్తికరంగా ఉంటుందంటున్నారు మేకర్స్‌. ప్రస్తుతం సొసైటీలో వేళ్లునుకుపోయిన ఓ ప్రధాన సమస్యను ఆసక్తికరగా తెర మీద చూపించనున్నారు. ఈ షోలో స్వర భాస్కర్‌ ఓ రూత్‌లెస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది. క్రైమ్‌ మిస్టరీని చేదించేందుకు స్వర అన్ని ఎన్నో సాహసాలు కూడా చేస్తుందని తెలుస్తోంది.

ఈరోస్‌ సంస్థ రూపొందించిన ఈ ఒరిజినల్‌ సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. మేకింగ్‌, నేరేషన్ స్టైల్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, నటీనటుల అద్భుతమైన పర్ఫామెన్స్‌ అన్ని కలిపి షో అందరినీ మెప్పిస్తుంది అని ఆసక్తికరంగా చెప్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios