Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ బుజ్జిని ఎలా తయారు చేశారు? ఫ్యూచర్ కార్ కి ఉన్న షాకింగ్ ఫీచర్స్ తెలుసా?

కల్కి విడుదలకు సమయం దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ షురూ చేశారు. దీనిలో భాగంగా కల్కి మూవీలో ప్రభాస్ వాహనం బుజ్జిని పరిచయం చేశారు. కాగా ఈ ఫ్యూచరిస్టిక్ కారును రూపొందించాడనికి ఇంజనీర్స్ చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం...  
 

engineering details about prabhas kalki bujji car blows your mind for sure ksr
Author
First Published May 25, 2024, 10:08 AM IST

ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2829 AD  జూన్ 27న వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది. విడుదల సమయం దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ షురూ చేశారు. దీనిలో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించారు. కల్కి చిత్రంలో ప్రభాస్ పాత్ర ఉపయోగించే కారును పరిచయం చేశారు. కల్కి లో ప్రభాస్ పాత్ర పేరు భైరవ కాగా ఆయనకు ఓ ప్రత్యేక వాహనం ఉంటుంది. దాని పేరే బుజ్జి. 

బుజ్జి ఫ్యూచరిస్టిక్ కారు. అది ప్రభాస్ తో మాట్లాడుతుంది. ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటుంది. అప్పుడప్పుడు వేధిస్తుంది. బుజ్జి ప్రోమోను ప్రత్యేకంగా విడుదల చేశారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన కల్కి ప్ ప్రమోషనల్ ఈవెంట్లో ప్రత్యేకంగా రూపొందించిన కారులో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. ఫ్యాన్స్ వెర్రెత్తిపోయే మూమెంట్ అది. 

కాగా బుజ్జి నిర్మాణం వెనుక పలువురు ఇంజనీర్స్ కృషి ఉంది. మహీంద్రా అండ్ జయేమ్ ఆటోమోటివ్ సంస్థలు సంయుక్తంగా ఈ కారును రూపొందించాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి మూవీలో ఉపయోగించే వాహనాల తయారీకి తమ ఇంజనీర్స్ సహాయం కావాలని ఆనంద్ మహీంద్రాను కోరారు. అందుకు ఆయన అంగీకారం తెలిపారు. చెప్పినట్లే బుజ్జి ని రూపొందించడానికి ఆయన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చారు. 

ఇక బుజ్జి ఇంజనీరింగ్ డీటెయిల్స్ వివరిస్తూ ఓ వీడియో వైరల్ అవుతుంది. మూడు చక్రాలు ఉండే బుజ్జి కారు టైర్స్ చాలా ప్రత్యేకంగా తయారు చేశారు. రిమ్ హైట్ 34.5 అంగుళాలు. ఈ భారీ టైర్స్ రూపొందించడానికి చాలా సమయం పట్టింది. రిమ్స్ కూడా అసాధారణమైనవి. హబ్ లెస్ టైర్స్ వాడారు. టైర్ బేరింగ్స్ సహాయంతో ముందుకు కదులుతుంది. ఇలా రూపొందించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. టైర్స్ తయారీకి సియట్ కంపెనీ ముందుకు వచ్చింది. 

ఈ కారు బరువు దాదాపు 6 వేల కేజీలు. పవర్ 94 కిలో వాట్స్, టార్క్ 9800NM , బ్యాటరీ 47kwh . కారులో ప్రత్యేకమైన ఓ ఛాంబర్ ఉంటుంది. అందులో హీరో శత్రువులను బందీలుగా అందులో ఉంచుతాడట. కారు వెనుక భాగంలో ఒక టైర్ మాత్రమే ఉంటుంది. అది అన్ని కోణాల్లోకి తిరుగగలదు. ఈ కారు నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యిందనేది మాత్రం తెలియరాలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios