ప్రస్తుతం మీటూ ఉద్యమంలో భాగంగా చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెడుతున్నారు. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారు పరువునష్టం ద్వారా వేయడం, పోలీసు కేసు పెట్టడం వంటివి చేశారు.

కొన్ని విషయాలను బయటకి రానివ్వకుండా సెటిల్మెంట్స్ చేస్తున్నారు. తాజాగా అమెరికన్ టీవీ నటి ఎలిజా ద్రుష్కు తన సహనటుడి కారణంగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టడంతో ఇద్దరూ కలిసి నటిస్తోన్న 'బుల్' అనే టీవీ సిరీస్ నుండి ఆమెని తొలగించారు.

తనను అన్యాయం తొలగించారని ఆమె కేసు పెట్టింది. కేసు విచారణ దశలో ఉండగానే.. 'బుల్' సిరీస్ నిర్మాత సంస్థ అయిన సిబిఎన్ నెట్ వర్క్ వారు ఆమెతో సెటిల్మెంట్ చేసుకున్నారు.

ఆ సిరీస్ కి నటి ఎలిజాకి సంబంధం లేదని ఒప్పంద పత్రం మీద ఆమె సంతకం తీసుకొని ఆమెకి రూ.68  కోట్ల రూపాయలను నష్టపరిహారంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో ఎలిజాకి భారీ మద్దతు లభించడంతో విషయం పెద్దది కాకుండా ముందుగానే ఆమెతో సెటిల్మెంట్ చేసుకొని ఆమె నోరు మూయించేశారు.