కోలివుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న కొత్త సినిమా షూటింగ్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. తమిళనాడులోని పూందమల్లి ఈవీపీ ఫిలిమ్స్ సిటీలో అట్లీ దర్శకత్వంలో విజయ్ నటిస్తోన్న సినిమా షూటింగ్ జరుగుతోంది.

సినిమా క్లైమాక్స్ కి సంబంధించిన కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. అయితే సెట్ లో క్రేన్ పై వంద అడుగుల ఎత్తులో అమర్చిన ఓ లైట్.. షూటింగ్ లో ఉన్న  ఎలక్ట్రీషియన్ సెల్వరాజ్ పై పడింది. దీంతో అతడి తలకు బలమైన గాయాలయ్యాయి.

వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఇలా ఉండగా.. బుధవారం నాడు  విజయ్  నేరుగా హాస్పిటల్ కి వెళ్లి సెల్వరాజ్ ఆరోగ్య పరిస్థితి గురించి  వైద్యులను అడిగి తెలుసుకున్నారు.