అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నెల రోజులే ఉంది. అయితే పరీక్షల కాలం ముగుస్తున్న తరుణంలో ఎలక్షన్స్ రావడం సినిమా ఇండస్ట్రీకి గట్టి దెబ్బ పడుతున్నట్లు అర్ధమవుతోంది. సమ్మర్ కోసం షూటింగ్స్ పూర్తి చేసుకొని రెడీ అయిన సినిమాలు మళ్ళీ రిలీజ్ తేదీలను వాయిదా వేసుకుంటున్నాయి.       

ఇటీవల నాని జెర్సీ ఏప్రిల్ 19కి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక సమంత నాగ చైతన్య ల మజిలీ కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. పెళ్లి తరువాత ఈ జంట కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ సినిమాను తెరకెక్కించాడు. సినిమా మొత్త షూటింగ్ కూడా ఇటీవల పూర్తయ్యింది. ఇక రిలిజ్ చేయడమే ఆలస్యం అనుకుంటున్నా సమయంలో సమ్మర్ హాలిడేస్ కి ఎలక్షన్స్ వచ్చాయి. ఇక ఎలక్షన్స్ తరువాత సినిమాను రిలీజ్  చేస్తారా అనే విషయంలో చిత్ర యూనిట్ నుంచి క్లారిటి రావాల్సి ఉంది.