Asianet News TeluguAsianet News Telugu

నేడే మా ఎన్నికలు... గెలుపెవరిది?

రెండు నెలలుగా జరుగుతున్న రచ్చకు నేడు తెరపడనుంది. ఆ బిగ్ డే వచ్చేసింది. నేడు అనగా అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి. 
 

elections day all set for maa elections who is going to win
Author
Hyderabad, First Published Oct 10, 2021, 8:21 AM IST

మా ఎన్నికలు టాలీవుడ్ లో చాలా మంది నటుల నిజస్వరూపాలు బయటపెట్టాయి. తాము సెలబ్రిటీలం అన్న విషయాన్ని వదిలేసి, సాధారణ పౌరులకంటే దారుణంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. నిన్న నాగబాబు సుదీర్ఘ వీడియో సందేశంలో ప్రకాష్ రాజ్ కి ఎందుకు ఓటు వెయ్యాలో, మంచు విష్ణుకు ఎందుకు ఓటు వెయ్యకూడదో వివరించాడు. ఈ క్రమంలో మంచు విష్ణుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

మోహన్ బాబును, మంచు విష్ణును టార్గెట్ చేస్తూ, నాగబాబు వీడియో విడుదల చేశారు. 
నాగబాబు వ్యాఖ్యలకు మంచు విష్ణు కూల్ గా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన ఓ వీడియో సందేశంలో నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా మా ఎన్నికలు మంచు, మెగా ఫ్యామిలీ మధ్య దూరం పెంచినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. మరి ఇరు ప్యానెల్స్ ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకోవడం జరిగింది . రెండు నెలలుగా జరుగుతున్న రచ్చకు నేడు తెరపడనుంది. ఆ బిగ్ డే వచ్చేసింది. నేడు అనగా అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి. 

Also read `మా` ఎన్నికల అధికారి మోహన్‌బాబు రిలేటివ్..నాగబాబు సంచలన ఆరోపణలు.. నరేష్‌ చెత్త అధ్యక్షుడంటూ కామెంట్‌


మా సభ్యులుగా ఉన్న 883 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 8 గంటల నుండి మద్యం 2 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్ పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మూడు ప్లటూన్ల బలగాలు ఎన్నికల కేంద్రంలో మోహరించాయి. ఎలక్షన్ బ్యాలెట్ పద్దతిలో జరుగుతుండగా, ఒక్కో గదిలో నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. 

Also read పోస్టల్ బ్యాలెట్‌పై అక్కసు... మా ఎన్నికల అధికారిపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

కాగా నాలుగు గంటల తరువాత కౌంటింగ్, నేడే తుది ఫలితాలు కూడా వెల్లడిస్తాడని సమాచారం. సాధారణ ఎన్నికలకు మించి రచ్చ జరిగిన నేపథ్యంలో గెలుపు ఎవరిని అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ఫలితాల తరువాత మోహన్ బాబు ప్రెస్ మీట్ పెడతారని తెలుస్తుంది. ఇన్నాళ్లు మంచు విష్ణు టార్గెట్ గా కొందరు చేసిన వ్యాఖ్యలకు ఆయన ఎలాంటి కౌంటర్లు ఇస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ వేదికగా చేసిన వ్యాఖ్యలకు, ఎన్నికల తరువాత సమాధానం చెబుతానని మోహన్ బాబు తెలియజేసిన విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios