సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలను అడ్డుకోవాలని చాలా విధాలుగా ప్రయత్నించింది టీడీపీ పార్టీ. సినిమాలో చంద్రబాబు నాయుడుని నెగెటివ్ గా చూపించారని, ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా రిలీజ్ ఆపాలంటూ కొందరు టీడీపీ నేతలు ఎలెక్షన్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు.

ఎన్నికల తొలిదశ పూర్తయ్యే వరకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని అడ్డుకోవాలని కోరారు. మార్చి 22న సినిమా విడుదల కానున్న నేపధ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై ఆసక్తి నెలకొంది.

అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలను అడ్డుకోవడం కుదరదని తేల్చిచెప్పారు ఈసీ. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ సినిమా విడుదలైన తరువాతే చర్యలు తీసుకునే అవకాశం ఉందని, నిజంగా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు సినిమాలో ఉంటే రిలీజ్ తరువాత చర్యలు తీసుకుంటామని, విడుదల ఆపడం కుదరదని అన్నారు. కాబట్టి మార్చి 22న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల కావడం పక్కా. ఇదే విషయాన్ని వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.