బాలీవుడ్ లో ఎన్నో సీరియళ్లకు నిర్మాతగా వ్యవహరించిన ఏక్తా కపూర్ గురించి తెలియని వారుండరు. నలభై ఏళ్లు దాటినా ఇంకా ఈ లేడీ ప్రొడ్యూసర్ పెళ్లి మాత్రం చేసుకోలేదు. కానీ సరోగసి పద్ధతి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

జనవరి 27న ఆమె తల్లి అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే తన బిడ్డను ఇంటికి తీసుకురానున్నారు. గతంలో ఏక్తాకపూర్ సోదరుడు తుషార్ కపూర్ కూడా ఇలానే సరోగసి పద్ధతి ద్వారా ఓ ఆడబిడ్డకు తండ్రి అయ్యాడు.

ఆ పాపతో ఏక్తాకపూర్ ఎంతో ప్రేమగా మెలిగేది. ఆ చిన్నారితో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఇప్పుడు తమ్ముడి స్ఫూర్తితో తాను కూడా సరోగసి పద్ధతి ద్వారా తల్లైంది.

గతంలో ఈమె కొందరు బాలీవుడ్ ప్రముఖులతో డేటింగ్ చేసేదని వార్తలు వచ్చాయి. కానీ ఏది కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. ఏక్తాకపూర్ కూడా పలు సందర్భాల్లో తనకు పెళ్లి చేసుకోవాలని లేదన్నట్లు చెప్పుకొచ్చింది. కానీ పిల్లలపై ఉన్న ఇష్టంతో ఇప్పుడు ఓ బిడ్డకు తల్లిగా మారింది.