కొత్తగా రాసిన పాటలకంటే పాత పాటలను మళ్ళీ రీమిక్స్ చేసి వాడుకోవడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఈ ట్రెండ్ ను టాలీవుడ్ లో సాయి ధరమ్ తేజ్ బాగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా స్టార్ పాటలను రీమిక్స్ చేసేసి తన సినిమాలలో పెట్టుకున్నాడు. ఈ ట్రెండ్ ఇక్కడే కాదు బాలీవుడ్లో కూడా బాగానే ఉంది.

ఇప్పటికే 'తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్' - 'హమ్మ హమ్మ' లాంటి పాటలను రీమిక్స్ చేసేసిన దర్శకులు ఇప్పుడు మరొక ఐటమ్ సాంగ్ మీద కన్నేశారు. అదే డింగ్ డాంగ్ డింగ్ డింగ్.. డింగ్ డాంగ్ డింగ్ డింగ్.. అదేనండీ 'ఏక్ దో తీన్' పాట. ఆ పాట లో మాధురి దీక్షిత్ నటన - డాన్స్ ఇంకా ప్రేక్షకుల కళ్ళముందు మెదలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ పాట ను టైగర్ శ్రోఫ్ తన సినిమా బాఘీ 2 లో రీమిక్స్ చేసి పెట్టబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మూడు పాటలు విడుదల చేశారు. అన్ని బాగానే రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇప్పుడు దీనిని నాలుగో పాటగా విడుదల చేయబోతున్నారు. తేజాబ్ సినిమాలో మాధురి నర్తించిన ఈ పాటకు బాఘీ 2 లో ఎవరు స్టెప్పులెయ్యబోతున్నారో తెలుసా..

జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ఇప్పటికే ఈ పాట తాలూకు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఆ ఫోటో లో జాకీ రంగురంగుల టూ పీస్ డ్రెస్ వేసుకుని కూర్చుని పోజ్ ఇస్తుండగా చుట్టూ చాలా మంది అబ్బాయిలు లైట్లు పట్టుకుని ఉన్నారు. సాజిద్ నడియాడ్ వాలా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం మార్చ్ 30న విడుదల కాబోతోంది.