తారలు దిగివచ్చిన వేళ.. మెగాస్టార్ విజేతగా..

First Published 21, Nov 2017, 9:12 PM IST
eightees 80s south stars meet party pics gone viral
Highlights
  • ఎనభైల దక్షిణాది తారలంతా ఒక చోట చేరిన వేళ
  • 2009 నుంచి ఎనభైల తారల ఆత్మీయ సమ్మేళనం
  • ఈ సమ్మేళనంలో  హీరోయిన్లంతా ప్రకటించిన ర్యాంప్ వాక్ విన్నర్  చిరంజీవి
  • మహాబలిపురంలో సరదాగా గడిపిన ఎనభైల సౌత్ సూపర్ స్టార్స్

కొన్నేళ్లుగా సాగుతున్న 80వ దశకం నాటి దక్షిణాది తారల ఆత్మీయ సమ్మేళనం ఈసారి తమిళనాడులోని మహాబలిపురంలో జరిగింది. 80 దశకంలో దక్షిణాది సినీ పరిశ్రమ సూపర్‌స్టార్లుగా మెరిసిన నటీనటులు ఆత్మీయంగా కలుసుకొన్నారు. వారి కలయికతో పండుగ వాతావరణం ఏర్పడింది.

 

నవంబర్‌ 17న జరిగిన పార్టీకి ముందు రోజు రాత్రి ఏడు గంటల నుంచే తారలందరూ ఒక్కక్కరుగా వచ్చారు. ఈ కార్యక్రమం రెండు రోజులపాటు చాలా ఆనందకరమైన వాతావరణంలో జరిగింది. ఈసారి పార్టీ థీమ్ కలర్ ఉదారంగు (పర్పుల్). ఉదారంగు దుస్తులు, పూలచొక్కాలు ధరించి తారలు సందడి చేశారు.

 

ఈ ఆత్మీయ సమ్మేళనానికి చిరంజీవి, వెంకటేష్, శరత్ కుమార్, జాకీ ష్రాఫ్, భాగ్యరాజ్, రాజ్ కుమార్, అర్జున్, నరేష్, భానుచందర్, సుమన్, సురేశ్, రెహ్మన్, సుహాసిని, కుష్బూ, రాధిక శరత్ కుమార్, అంబికా, రాధ, జయసుధ, పూనమ్ థిల్లాన్, పూర్ణిమ భాగ్యరాజ్, రమ్యకృష్ణ, పార్వతీ జయరామ్, సుమలత, లీసి, రేవతి, మేనక, శోభన, నదియా హాజరయ్యారు. ముంబై నుంచి జాకీ ష్రాఫ్, పూనమ్ థిల్లాన్ తరలివచ్చారు. మొత్తం 28 మంది ప్రముఖ నటీనటులు పాల్గొన్నారు.

 

పార్టీలో ర్యాంప్ వాక్ నిర్వహించగా... మొదట నటీమణులు, ఆ తర్వాత నటులు ర్యాంప్‌పై నడిచారు. హీరోల్లో మెగాస్టార్ చిరంజీవిని హీరోయిన్లంతా విజేతగా ప్రకటించడం విశేషం. ఇక గాయకుడు శ్రీరాం ఆనాటి హిట్ పాటలను పాడగా, ఆ పాటల విశిష్టతను, వారి అనుభవాలను హీరో, హీరోయిన్లు పంచుకొన్నారు. రెండురోజుల పార్టీ తర్వాత 19వ తేది రాత్రి వారి వారి షూటింగులకు, నివాసలకు వెళ్లిపోయారు.

 

తాజాగా ఎనిమిదోసారి జరిగిన ఈ తారల ఆత్మీయ కలయికకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈసారి పార్టీని మహాబలిపురంలోని ఇంటర్నేషనల్ రిస్టార్టులో ఈ పార్టీని లీసీ, సుహాసిని నిర్వహించారు. ఈ పార్టీకి రాజ్ కుమార్ సేతుపతి, పూర్ణిమా భాగ్యరాజ్, కుష్భూ సహకారం అందించారు.

 

80 దశకం నాటి నటీనటులు కలుసుకోవడం 2009లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతీ ఏడాది కలుసుకోవడం జరుగున్నది. ప్రతీసారి ఓ యాక్టర్ పార్టీని నిర్వహించాలనే నిబంధనను పెట్టుకొన్నారు. 80 దశకంలో సినీ పరిశ్రమను ఏలిన నటీనటులందరూ కలుసుకోవాలనే ఆలోచన మొదట హీరోయిన్లు సుహాసిని, లిసీకి వచ్చింది. వారి ఆలోచనను వెంటనే అమల్లోకి తెచ్చి నటీనటులందరిని ఒకచోటికి తెచ్చారు. ప్రస్తుతం ఈ క్లబ్‌లో దక్షిణాదికి చెందిన దిగ్గజ నటీనటులు మొత్తం 32 మంది ఉన్నారు. ఈ భేటికి ముందు గతంలో 2017 జూన్ మొదటివారంలో కూడా ఈ ఎనభైల స్టార్ నటీనటులు కలుసుకొన్నారు.

loader